మ‌ళ్లీ మోడీ విగ్ర‌హ రాజ‌కీయం..ఈ ద‌ఫా ఆయ‌న కాదు

మ‌ళ్లీ మోడీ విగ్ర‌హ రాజ‌కీయం..ఈ ద‌ఫా ఆయ‌న కాదు

విగ్ర‌హ రాజ‌కీయం మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చింది. బీజేపీ గ‌తంలో ఉధృతంగా ముందుకు తీసుకుపోయి అనూహ్యంగా ప‌క్క‌న‌పెట్టిన మ‌హ‌నీయుల విగ్ర‌హ ఎజెండా ఇప్పుడు మ‌రో రూపంలో వార్త‌ల్లోకి ఎక్కింది. అయితే గ‌తంలో నిర్ణ‌యం తీసుకుంది ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ కాగా...ఇప్పుడు బీజేపీ సార‌థ్యంలోని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అలాంటి ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త మాజీ ప్ర‌ధాని సర్ధార్ వల్లబాయ్ పటేల్ విగ్రహాన్నినర్మదా నదిపై సర్ధార్ సరోవర్ డామ్ దగ్గర నిర్మించి ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. 182 మీటర్ల పొడవైన ఈ విగ్రహాన్ని.. రూ. 3 వేల కోట్లతో నిర్మించారు.  2013 లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ప్రధాని మోడీ శంకుస్ధాపన చేశారు. 526 స్వతంత్ర రాజ్యాలను భారత యూనియన్ లో విలీనం చేసిన సర్ధార్ ను “ఐరన్ మాన్ ఆఫ్ ఇండియా”గా వర్ణిస్తూ మోడీ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. పీపీపీ పద్దతిలో ఈ ప్రాజెక్టును L&T చేపట్టింది. ఈ మెమోరియల్ ను జాతికి అంకితం చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణతో ప్రపంచంలోనే ఇదే అతి పెద్ద విగ్రహంగా నిలిచింది.

ఇదే త‌ర‌హాలో తాజాగా మ‌రో విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ సిద్దాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే సాధారణ ఎన్నికల్లోపు అత్యంత ఎత్తైన విగ్రహం వారణాసిలో ఏర్పాటు కానుంది. దీన్‌దయాళ్ స్మారక నిర్మాణం పనులను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ప్ర‌ధాని మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలోని ప్రఖ్యాత పద్మారావు చౌక్‌లో 60 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నట్లు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఉపాధ్యాయ సొంత రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో కనీసం ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తమ ప్రణాళికలో ఒక భాగమని ఆయన చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గతేడాది గోరఖ్‌పూర్‌లోని దీన్‌దయాళ్ యూనివర్శిటీలో తొలిసారి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బాలియా, మథుర తదితర ప్రాంతాల్లో ఆయన విగ్రహాలను నెలకొల్పారు.

మోడీకి తెలుగు రాష్ట్రాల‌తో దేశ ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చ‌డానికి డ‌బ్బులుండ‌వు. పెట్రోలు ధ‌ర త‌గ్గించ‌మంటే... స‌బ్సిడీ ఇస్తే డ‌బ్బులు చాల‌వ‌ని క‌బుర్లు చెబుతూ మ‌రోవైపు విగ్ర‌హాల‌కు మాత్రం వంద‌ల కోట్లు కేటాయిస్తూ పోతోంది మోడీ సర్కారు. 12 వేల కోట్ల‌కు గాను వెయ్యి కోట్లు కూడా రాల్చ‌ని మోడీ తాజాగా వార‌ణాసిలో దీన్‌ద‌యాళ్ విగ్ర‌హానికి స‌ముఖ‌త తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు