కెన‌డాలో ఇండియ‌న్ రెస్టారెంట్‌లో పేలుడు..

కెన‌డాలో ఇండియ‌న్ రెస్టారెంట్‌లో పేలుడు..

అమెరికాలో కాల్పుల ఉదంతాల ప‌రిణామాలు స‌ద్దుమ‌ణ‌గ‌క‌ముందే..మ‌రో క‌ల‌క‌లం రేగింది. కెనడాలో ఉన్న ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. మిస్సిసౌగా ప్లాజాలో ఉన్న రెస్టాంట్‌లో పేలుడు జరిగింది. ఆ ఘటనలో 15 మంది గాయపడ్డారు.

ఆ సమయంలో పలువురు భారతీయులు హోటల్లో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. దీన్ని అనుమానాస్పద సంఘటనగా పోలీసులు భావిస్తూ ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఇద్ద‌రు వ్య‌క్తులు ఈ దాడికి పాల్ప‌డ్డార‌ని స‌మాచారం.

హురాంటోరియా వీధిలో ఉన్న బాంబే బేల్ ఏరియాను ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. పేలుడు వల్ల ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఆ ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని టొరంటో ట్రామా సెంటర్‌కు తరలించారు.

అయితే బిల్డింగ్‌లో ఏ ప్రాంతంలో పేలుడు జరిగింది, ఆ టైమ్‌లో ఎంత మంది అక్కడ ఉన్నారన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియదని పోలీసులు చెప్పారు.  గత నెలలో టొరంటోలో ఓ డ్రైవర్‌ వ్యాన్‌ అద్దెకు తీసుకుని దూసుకెళ్లిన ఘటనలో 10 మంది మృత్యువాత పడగా, మరో 15 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు