కొత్త స‌ర్వే- మోడీకి బ్యాడ్ డేస్‌

కొత్త స‌ర్వే- మోడీకి బ్యాడ్ డేస్‌

2014 ఎన్నిక‌లు ఒక క‌లలా జ‌రిగిపోయాయి. అస‌లు 2000 త‌ర్వాత ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అయిన ఓ వ్య‌క్తి అన‌తి కాలంలోనే ఏకంగా సొంత మెజారిటీతో అధికారంలోకి రావ‌డం అనూహ్య ప‌రిణామ‌మే. ప‌రిస్థితులు ఎలా అయిన ఉండ‌నీ గానీ వాటిని త‌న‌కు అనుకూలంల‌గా మార్చుకోవ‌డంలో మోడీ స్ట్రాట‌జీ వంద శాతం వ‌ర్కవుట‌యింది. అయితే, ప‌ద‌విచ్చిన అహంకార‌మో, అర్హ‌త‌కు మించిన అధికార‌మో గానీ ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా ఇమేజ్ కోల్పోతున్నారు న‌రేంద్ర మోడీ. ఇంత‌కు మునుపు మోడీ ఏం చేసినా స‌ర్‌ప్రైజ్‌లా ఉండేది. కానీ ఇపుడు జ‌నం అత‌డి భ‌విష్య‌త్తు చ‌ర్య‌ల‌ను సులువుగా గెస్ చేయ‌గ‌లుగుతున్నారు.

అయితే, రోజురోజుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ తేడా లేకుండా మోడీపై వ్య‌తిరేక‌త పెరుగుతుండ‌టంతో ఇది నిజ‌మేనా లేక ప్ర‌చార‌మా అని ఏబీపీ న్యూస్‌-సీఎస్‌డీఎస్ ఒక స‌ర్వే నిర్వ‌హించింది. ఇందులో అనేక ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు వెలుగుచూశాయి. మోడీపై వ్య‌తిరేక‌త ఒక ప్ర‌చారం కాదు, నిజం అని చెప్పిందా స‌ర్వే. ఆ స‌ర్వే హైలైట్స్‌.

హైలెట్స్ ఆఫ్ ది స‌ర్వే

1. మోడీకి 274 సీట్లు వ‌స్తాయి కానీ ఓట్లు మాత్రం 37 శాత‌మే న‌ట‌.
2. ఆశ్చ‌ర్య‌క‌రంగా కాంగ్రెస్ పుంజుకుంది. కాంగ్రెస్‌కు 31 శాతం-164 సీట్లు, ఇత‌రుల‌కు 32 శాతం ఓట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ట‌.
3. ద‌క్షిణ భార‌తంలోని 132 సీట్ల‌లో మోడీ 22కు మించి గెలిచే అవ‌కాశ‌మే లేద‌ట‌.
4. రాహుల్ గాంధీ పాపులారిటీ గ‌తంతో పోలిస్తే 8 శాతం పెరిగింద‌ట‌. మ‌రో ఏడాదిలో ఇంకా పెరిగే అవ‌కాశ‌మూ ఉంది.
5. ఉత్త‌ర భార‌తంలో మోడీ కంటే కూడా ఇత‌ర పార్టీల‌కే ఓట్లు ఎక్కువ ప‌డ‌తాయ‌ట‌.
6. రాజ‌స్థాన్‌లో ఎన్డీయే గాలి లేదు. ఓడినా ఓడొచ్చంటున్నార‌ట‌.
7. బీఎస్పీ-ఎస్పీ కూట‌మి ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో బీజేపీని మ‌ట్టి క‌రిపిస్తుంద‌ట‌.
8. ప‌శ్చిమోత్త‌ర భార‌తంలో మాత్రం లోక్‌స‌భలో మోడీ ప్ర‌భావం ఇంకా స్ట్రాంగ్ గానే ఉందంటున్నారు.
9. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ విప‌రీతంగా పుంజుకుంద‌ట‌. 49 శాతం ఓట్లు సంపాదించే అవ‌కాశం ఉంద‌ట‌.
10. బీహార్‌, ప‌శ్చిమబెంగాల్‌లో కూడా బీజేపీ మీద స్థానిక పార్టీల‌దే పైచేయిగా ఉంద‌ట‌.

ఈ స‌ర్వేలో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే... రాష్ట్రాలను విడిగా చూసి అంచ‌నా వేస్తే మోడీ ఇమేజ్ భారీగా దెబ్బ‌తిన్న‌ట్టు క‌నిపిస్తోంది. కానీ మోడీ బొటాబొటి మెజారిటీతో గెల‌వొచ్చ‌ని (ఈరోజు ఎన్నిక‌లు జ‌రిగితే) అంటున్నారు. కానీ ప్రాంతీయ పార్టీల కూట‌మిలు ఈ సారి దేశ వ్యాప్తంగా భారీగా ఏర్పాట‌వుతున్న నేప‌థ్యంలో మోడీకి క‌చ్చితంగా బ్యాడ్ డేస్ మొద‌ల‌య్యాయ‌ని చెప్పొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు