మెగాస్టార్ మాదిరిగా కోహ్లీ కూడా!!

మెగాస్టార్ మాదిరిగా కోహ్లీ కూడా!!

ఎవరికైనా బహుమతులు.. పురస్కారాలను ఇంట్లో పెట్టుకోవడం.. ఇంటికి వచ్చిన వారందరికీ కనిపించేలా వాటిని అలంకరించుకోవడం బాగా ఇష్టంగానే ఉంటుంది. ఇక యాక్టర్స్.. స్పోర్ట్స్ పర్సన్స్ విషయానికి వస్తే.. అవార్డులు మరీ ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటాయి. వాటి అలంకరణ కోసం స్పెషల్ గా షెల్ఫులు ఏంటి.. రూములు కూడా కట్టించేసుకుంటూ ఉంటారు.

కానీ విరాట్ కోహ్లీ మాత్రం తాను ఇందుకు పూర్తిగా విభిన్నం అంటున్నాడు. ఇప్పటివరకూ తమ ఇంట్లోనే ఇలాంటి అవార్డులు.. షీల్డులు ఉన్నా.. ఇకపై మాత్రం ఉండబోవంటున్నాడు. ఇందుకు కారణం.. అనుష్కతో పెళ్లి జరగడమే. ప్రాబ్లెం పెళ్లి కాదు లెండి.. తర్వాత పుట్టబోయే బిడ్డలు అంటున్నాడు విరాట్. పెళ్లి తర్వాత వెంటనే అయినా కాకపోయినా.. కచ్చితంగా పిల్లల ప్లానింగ్ ఉంటుంది కదా. తమ పిల్లల విషయానికి వచ్చేసరికి.. ఇంట్లో కనిపించే షీల్డులు.. పురస్కారాలు.. సర్టిఫికేట్లు.. ఇవేవీ వాళ్లు ఎదుగుతున్న సమయంలో ప్రభావం చూపకూడదట. తమ ఇమేజ్ వారి బాల్యంపై ఎఫెక్ట్ చూపకుండా ఉండాలని అంటున్నాడు కోహ్లీ.

అందుకే తమ ఇద్దరి జంట.. తమకు వచ్చిన అన్ని అవార్డులను ఇంటికి దూరంగా వేరే చోట ఉంచుతారట. టాలీవుడ్ లో ఇలాంటి అలవాటు మెగాస్టార్ చిరంజీవికి ఉంది. ఆయన ఒక్క అవార్డును కూడా ఇంటికి తీసుకెళ్లరు. అన్నీ తన ఆఫీస్ లోనే ఉంచుతారు చిరంజీవి. లివింగ్ రూమ్ డిస్కషన్స్ ను ఇంటికి తీసుకెళ్లడం చిరుకు ఇష్టం ఉండదు. అందుకే ట్రోఫీల వంటివి ఆయన ఇంటిలో కనిపించవు. ఇప్పుడు విరాట్ కూడా ఇలాగే వ్యవహరించి.. ఫ్యూచర్ ను డిజైన్ చేసుకోవాలని నిర్ణయించానని అంటున్నాడు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు