నిలదీశారు విమర్శించుకున్నారు

నిలదీశారు విమర్శించుకున్నారు

హైదరాబాద్‌లో గొప్పగా కాంగ్రెసు పార్టీ రాష్ట్ర స్థాయి సదస్సు జరుపుకున్నది. ఈ సదస్సులో క్రింది స్థాయి నేతలు, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు వంటి ప్రముఖులను నిలదీశారు. కష్టపడి పనిచేసే తమను పట్టించుకోవడంలేదని, నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయకపోతే పార్టీ కోసం ఎలా పనిచేస్తామని ప్రశ్నించారు. క్రిందిస్థాయిలో ఉండే నేతలు ఇలా ఆగ్రహం వ్యక్తం చేయగా, ముఖ్యమంత్రిపై పరోక్షంగా విమర్శలు చేశారు ఉప ముఖ్యమంత్రి.

పార్టీలో అందరూ ఒకే మాటపై ఉండేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ. ప్రభుత్వ పథకాలను ముఖ్యమంత్రి ఏక పక్షంగా ప్రకటిస్తున్నారనే విమర్శ ఒకటి ఉన్నది. క్యాబినెట్‌ మంత్రులే ఈ విమర్శలు చేస్తున్నారు. దీనిపై దామోదర, రాష్ట్ర స్థాయి సదస్సులో ముఖ్యమంత్రిని విమర్శించడం చర్చనీయాంశంగా ఉంది. పదవుల్లో ఉన్నవారే ఇలా విమర్శించుకుంటోంటే నామినేటెడ్‌ పదవులెలా భర్తీ అవుతాయని క్రింది స్థాయి నేతలు ఆవేదన చెందారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు