ధ‌ర్మ‌సందేహం - ఫిర్యాదు చేయ‌డానికి అమిత్ షా ఎవ‌రు?

ధ‌ర్మ‌సందేహం - ఫిర్యాదు చేయ‌డానికి అమిత్ షా ఎవ‌రు?

టీటీడీ పాల‌క‌మండలికి, ఆల‌య మాజీ ప్ర‌ధాన అర్చ‌కుడు ర‌మ‌ణ దీక్షితులుకు మ‌ధ్య ఏర్ప‌డ్డ వివాదం చినికిచినికి గాలివాన‌గా మారిన సంగ‌తి తెలిసిందే. తిరుమ‌ల‌లో ఆగ‌మ శాస్త్రాల‌కు విరుద్ధంగా జ‌రుగుతోన్న ప‌నుల‌పై నోరు మెదిపినందుకే త‌న‌పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం క‌క్ష్య తీర్చుకుంటోంద‌ని ర‌మ‌ణ దీక్షితులు ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన అమిత్ షాను తానే ఆహ్వానించి, స్వామి దర్శనం చేయించానని అన్నారు.

ఆ త‌ర్వాత శ్రీ‌వారి వంటగది లోప‌లికి తీసుకెళ్లాన‌ని,శ్రీ‌వారి వంట‌శాల‌లో జ‌రిగిన మార్పుల‌ను వివ‌రించాన‌ని ర‌మ‌ణ దీక్షితులు అన్నారు. స్వామి నైవేద్యాలను  మొదటి ప్రాకారానికి అవ‌త‌ల ఎప్పుడూ చేయలేదని, పెద్ద తప్పు జరిగిందని చెప్పాన‌ని అన్నారు.  శ్రీ‌వారి వంట‌శాల 22 రోజుల పాటు మూసి ఉన్న సంగతి, అందులో మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టిన సంగ‌తి అమిత్ షాకు  చెప్పినందుకే త‌న‌పై చంద్ర‌బాబు క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని ఆరోపించారు. సీఎం చంద్ర‌బాబు పై ర‌మ‌ణ దీక్షితులు చేసిన ఆరోప‌ణ‌లు హాస్యాస్ప‌దంగా క‌నిపిస్తున్నాయ‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.

వాస్త‌వానికి టీడీడీ పాల‌క‌మండలిలోగానీ, తిరుమ‌ల శ్రీ‌వారికి ధూప‌దీప నైవేద్యాల విష‌యంలోగానీ ఏమ‌న్నా ఇబ్బందులు క‌లిగితే లోలోప‌లే ప‌రిష్కరించుకుంటారు. ఒక‌వేళ చేయి దాటితే టీటీడీ ఛైర్మ‌న్ కు ఫిర్యాదు చేయ‌డం ఆన‌వాయితీ. ఈ స‌మ‌స్య‌ను ఛైర్మ‌న్ ప‌రిష్క‌రించ‌లేని ప‌క్షంలో ....ఆ వ్య‌వ‌హారం దేవాదయ శాఖా మంత్రి ద‌గ్గ‌ర‌కు వెళుతుంది. అంత‌కు మించి వివాదం ముదిరితే....సీఎం ద‌గ్గ‌ర‌కు స‌మ‌స్య వెళుతుంది. ఇపుడు ర‌మ‌ణ దీక్షితులు వ్య‌వ‌హారంకూడా సీఎం దృష్టికి వెళ్ల‌డంతో ఆయ‌న దానిపై విచార‌ణ జ‌రిపించి స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ నేప‌థ్యంలో....టీటీడీకి ఏమాత్రం సంబంధం లేని అమిత్ షాకు శ్రీ‌వారి పాక‌శాల గురించి ర‌మ‌ణ దీక్షితులు ఫిర్యాదు చేయ‌డం నిజంగా హాస్యాస్పద‌మే. ఆ స‌మ‌స్య‌ను తీర్చ‌డానికి అమిత్ షా టీడీడీ ఛైర్మ‌న్ కాదు క‌దా....క‌నీసం బోర్డు స‌భ్యుడు కూడా కాదు. అమిత్ షా....దేవాదాయ శాఖ మంత్రో....సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తో....ప్ర‌ధానో అయితే ఆ ఫిర్యాదుకు ఏమ‌న్నా అర్థం ప‌ర‌మార్థం ఉండేది. ఈ నేప‌థ్యంలోనే ర‌మ‌ణ దీక్షితులు ...కేవ‌లం చంద్ర‌బాబును భ్ర‌ష్టుప‌ట్టించ‌డానికే బీజేపీతో జ‌త‌క‌ట్టి అమిత్ షా చేతిలో కీలుబొమ్మ అయ్యార‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు