సంచ‌ల‌నం- మూడో కూట‌మికి బాబు పిలుపు!

సంచ‌ల‌నం- మూడో కూట‌మికి బాబు పిలుపు!

ఈరోజు కుమార‌స్వామి ప్ర‌మాణ స్వీకారానికి బెంగుళూరు వెళ్లిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. జాతీయ మీడియాతో ఇత‌ర రాష్ట్ర ప్ర‌ముఖ‌ల‌తో క‌లిసి చంద్ర‌బాబు మీడియాకు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

రాజ‌కీయాల‌ను అరాచ‌కంగా మార్చి దేశాన్ని బీజేపీ నుంచి కాపాడాలంటే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్క‌టి కావాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ఈ ప్ర‌క‌ట‌న చేసిన‌పుడు ఆయ‌న ప‌క్క‌న వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఉన్నారు.

ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌తో పాటు, జాతీయ ప్ర‌యోజ‌నాలు కూడా చాలా ముఖ్య‌మ‌ని దేశానికి కొత్త మార్గం చూపుతానని చెప్పిన వాళ్లు ఇంతుకు మునుపు ఎవ్వ‌రూ చేయ‌నంత అప‌కారం చేస్తున్నార‌ని తీవ్ర‌మైన ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో జేడీఎస్‌తో క‌లిసి ప‌నిచేసే టైం రావొచ్చ‌ని చంద్ర‌బాబు చెప్పారు.

బెంగుళూరులో కుమార‌స్వామి ప్ర‌మాణ స్వీకారానికి వ‌చ్చిన జాతీయ నేత‌లంతా చంద్ర‌బాబు ప‌ల‌క‌రించారు. మాయావ‌తి, మ‌మ‌తా బెన‌ర్జీల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ఇప్ప‌టికే బీఎస్పీ-స‌మాజ్‌వాదీ పార్టీ ఏక‌మైన నేప‌థ్యంలో మ‌మ‌తా బెన‌ర్జీ, ఇటు ద‌క్షిణ ప్రాంతీయ పార్టీలు క‌లిసి బాబుతో క‌ల‌వ‌డం బీజేపీ గుండెల్లో రైల్లు ప‌రుగెత్తించింది. ఎన్సీపీ నేత శ‌ర‌ద్‌ప‌వార్‌, కేర‌ళ నేత‌లు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా బాబుకు ఓకే అంటున్న నేప‌థ్యంలో జాతీయ రాజ‌కీయాలు కీల‌క‌మల‌పు తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు