మోదీజీ... బీ కేర్‌ఫుల్.. హీరో విశాల్ హెచ్చరిక

మోదీజీ... బీ కేర్‌ఫుల్.. హీరో విశాల్ హెచ్చరిక

తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినవారిలో 11 మంది కాల్పులకు బలి కావడం తెలిసిందే. ఈ ఘటనపై తమిళ హీరో విశాల్ తీవ్రంగా స్పందించాడు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు.

‘‘ఈ ఆందోళన జరిగింది సామాజిక అంశానికి సంబంధించే కానీ వ్యక్తిగత లక్ష్యాల కోసం కాదు. ‘స్టెరిలైట్’ కు వ్యతిరేకంగా సుమారు యాభై వేల మంది ఈ నిరసనలో పాల్గొన్నారంటే దాని అర్థమేంటి! ప్రజా సంక్షేమానికి ఏదైతే వ్యతిరేకమో దానిని నిలువరించేందుకు తూత్తకుడి ప్రజలు ఒక్కటయ్యారు.’’ అన్నారు.

‘‘ప్రియమైన ప్రధానీ..  దయచేసి, ఇప్పటికైనా మౌనం వీడండి. నిరసన తెలియజేయడమనేది ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతని బీజేపీ చెబుతోంది. మరి, అదే పని ప్రజలు ఎందుకు చేయకూడదు?  ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే.. వేరే దానికోసం కాదు. దయచేసి.. 2019 లో జాగ్రత్తగా ఉండండి’ అని తన ట్వీట్లో పేర్కొన్నాడు.

కాగా, 2019 లో జాగ్రత్త అంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికల విషయాన్ని బీజేపీకి పరోక్షంగా విశాల్ గుర్తుచేశాడు. అయితే.. తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై విశాల్ కేంద్రంలోని బీజేపీకి ముడి పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు