క్రేజీ రిక్వెస్ట్ - పార్ల‌మెంటులో పోర్న్ చూస్తాం.. అనుమ‌తివ్వండి !

క్రేజీ రిక్వెస్ట్ - పార్ల‌మెంటులో పోర్న్ చూస్తాం.. అనుమ‌తివ్వండి !

ఈ మ‌ధ్యకాలంలో బాధ్య‌త గ‌ల ప్ర‌జా ప్ర‌తినిధులు ప‌విత్ర‌మైన చ‌ట్ట స‌భ‌ల్లో కూర్చొని ద‌ర్జాగా నీలిచిత్రాలు చూసిన ఘ‌ట‌న‌ల గురించి మ‌నం వింటూనే ఉన్నాం. భార‌త‌దేశ పార్ల‌మెంటులో సెష‌న్స్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే బీజేపీ ఎంపీలు కొంద‌రు పోర్న్ చూస్తూ దొరికిపోవ‌డం....ఆ త‌ర్వాత వారిని స‌స్పెండ్ చేయ‌డం తెలిసిందే. తాజాగా జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చార‌న్న‌ది వేరే విష‌యం. అయితే, దొరికిపోయిన వారు కొంద‌రైతే....దొర‌కకుండా గుట్టుచ‌ప్పుడు కాకుండా పోర్న్ చూసేవారు మ‌రెంద‌రో ఉన్నారు.

పార్ల‌మెంటులోనే పోర్న్ చూడాల‌న్న కోరిక మ‌న ఎంపీల‌తో పాటు బ్రిట‌న్ లోని ఎంపీల‌కు కూడా ఉంద‌ట‌. అందుకే, బ్రిట‌న్ పార్ల‌మెంటులోని ఎంపీలంతా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. తమకు పార్ల‌మెంటులో పోర్న్ సైట్ చూసేందుకు అనుమ‌తించాల‌ని విన్న‌పాలు పెట్టుకున్నారట. అక్క‌డ ఎంపీలు, సిబ్బంది క‌లిసి 24,473 విన్నపాలు విన్న‌వించుకున్నారంటే వారెంత ర‌సిక శిఖామ‌ణులో అర్థం చేసుకోవ‌చ్చు.

బ్రిట‌న్ పార్ల‌మెంటులో పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావ‌డంతో ప్ర‌ధాని థెరిసా మే చ‌ర్య‌లు తీసుకున్నారు. త‌న స్నేహితుడు , మంత్రి డామియన్‌ గ్రీన్ ఆ ఆరోప‌ణ‌ల‌పై తొలగించారు. అయితే, తాజాగా పార్లమెంటులో ఉన్న 8500 కంప్యూటర్ల‌లో పోర్న్ చూసేందుకు త‌మ‌కు అనుమ‌తినివ్వాల‌ని అక్క‌డి ఎంపీలు, సిబ్బంది రిక్వెస్ట్లు పంపుతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో బ్రిటన్ పార్లమెంటు(హౌజ్‌ ఆఫ్‌ పార్లమెంట్‌)లో ప్ర‌జాప్ర‌తినిధుల గురించి షాకింగ్ నిజాల‌ను ఓ సంస్థం వెల్ల‌డించింది.

 బ్రిట‌న్ పార్లమెంటులో కంప్యూటర్లలో అశ్లీల వెబ్‌సైట్ ల‌కు యాక్సెస్‌ ఇవ్వాలని 24,473 విన్నపాలు వ‌చ్చాయ‌ని బ్రిటన్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఎఫ్ఓఐ) పేరుతో బ్రిటన్‌ ప్రెస్‌ అసోసియేషన్‌.....ఈ వివ‌రాల‌ను సేకరించింది. గ‌త ఏడాది జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు రోజుకు 160 విన్న‌పాలు వ‌చ్చాయట‌. బ్రిట‌న్ పార్లమెంటును ఆద‌ర్శంగా తీసుకొని ప‌లు దేశాల్లో నిబంధ‌న‌లు రూపొందించారు. మ‌రి అక్క‌డ ప‌రిస్థితి ఇలా ఉంటే..మిగ‌తా చోట్ల ఎలా ఉందో అని నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు