సిద్దాంతి చెప్పాడని డ్రెస్ మార్చిన పవన్?

సిద్దాంతి చెప్పాడని డ్రెస్ మార్చిన పవన్?

పవన్ కళ్యాణ్ ఎప్పడూ విభిన్న శైలినే చూపిస్తుంటాడు. అదే ఇన్ని కోట్ల మందిని పవర్ స్టార్ కు హార్డ్ కోర్ అభిమానులుగా మార్చేసింది. సినిమాలు మాత్రమే కాదు.. వ్యక్తిగత వైఖరి.. ప్రవర్తన కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. అలాంటి పవన్ కు.. గ్రహాలు- శాంతులపై నమ్మకాలు ఉంటాయని అంటే కాస్త చిత్రంగానే ఉండవచ్చు. కానీ ఇది నిజమే అంటున్నారు కొందరు.

సినిమాల్లో ప్యాంట్ మీద ప్యాంట్.. 100 పాకెట్స్ ఉండే ప్యాంట్ లాంటి చిత్రవిచిత్రమైన డ్రెస్సులను కూడా అందంగా చూపించిన పవర్ స్టార్.. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. కంప్లీట్ గా వైట్ అండ్ వైట్ లోకి మారిపోయాడు. తెల్లని జుబ్బా.. కుర్తా ధరించి.. అసలు సిసలైన రాజకీయ నాయకుడిగా ఛేంజ్ అయిపోయాడు పవర్ స్టార్. అయితే.. మొన్న ఒకరోజు మాత్రం పోరాటయాత్ర చేసినపుడు.. గ్రీన్ కలర్ జాకెట్ అండ్ జీన్స్ ప్యాంట్ లో దర్శనం ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

ఇలా పవన్ కళ్యాణ్ గ్రీన్ కలర్ వేయడం వెనుక వేరే కథ ఉందిట. తెల్లని దుస్తులు ధరించడం మంచి విషయమే అయినా.. ఎప్పుడూ ధవళ వర్ణం మాత్రమే వేసుకుని కనిపించడం సరి కాదని.. ఈ మధ్యన ఓ సిద్ధాంతి పవన్ కు చెప్పాడట. అందుకే అడపాదడపా ఛేంజ్ చూపించాలని ఫిక్స్ అయ్యాడట. పవన్ చేతికి కనక పుష్య రాగం పొదిగి ఉంగరం ఎప్పుడూ కనిపిస్తుంది. అటు రంగు.. ఇటు ఉంగరం.. రెండూ కలిపి చూస్తే మాత్రం పవన్ కూడా ఇలాంటివి నమ్ముతాడని అనిపించడం సహజం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు