కృష్ణంరాజు అంత దుర్మార్గమైన పని చేశారా?

కృష్ణంరాజు అంత దుర్మార్గమైన పని చేశారా?

రాజకీయాల్లో తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కరికి కలిసొస్తే ఒక్కొక్కరిని దారుణంగా దెబ్బతీస్తాయి. కాలం కలిసి రాకపోతే ఎలాంటి నేతలకైనా కష్టకాలం తప్పదు. ఒకసారి దెబ్బతిన్నాక మళ్లీ పుంజుకోవడం కూడా ఒక్కోసారి కష్టమవుతుంది. అలాంటి నిర్ణయాల పట్ల ఆ నేతలు జీవితాంతం మదనపడుతుంటారు. తాజాగా మాజీ కేంద్రమంత్రి, ఒకప్పటి హీరో కృష్ణం రాజు కూడా తాను తీసుకున్న తప్పుడు నిర్ణయం గురించి ఇటీవల ఓ చానల్ తో మాట్లాడుతూ వెల్లడించారు.

కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు ఇటీవల ఓ చానెల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వాజ్‌పేయి హయాంలో కృష్ణం రాజు బీజేపీని వీడి మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ‘ప్రజారాజ్యం’పార్టీలో చేరారు. టైం బాగులేక ఆ పార్టీలో చేరానని.. పదవులకు ఆశపడి చేరానని ఇప్పుడాయన అంటున్నారు.

తాను విధిరాతను నమ్ముతానని.. ప్రజారాజ్యం పార్టీలో ఎవరూ చేరొద్దని చెప్పిన తానే అందులో చేరానని.. అయితే, కొన్నాళ్లకే అందులోంచి బయటకు వచ్చేశానని అన్నారు. తనలో అంత దుర్మార్గుడు ఉన్నాడని అనుకోలేదని..  అప్పట్లో భారతీయ జనతాపార్టీ పరిస్థితి సరిగ్గా లేదు గనుక పీఆర్పీలో చేరితే మళ్లీ ఎంపీ అవుతానేమో అని ఒక దురుద్దేశంతో పార్టీ మారానని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు