భార‌త్ పేద దేశం అని ఎవరన్నారు

భార‌త్ పేద దేశం అని ఎవరన్నారు

ప్ర‌పంచంలోకెల్లా అత్యంత శ‌క్తిమంత‌మైన దేశంగా అమెరికా ప్ర‌ఖ్యాతి గాంచిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ‌దేశాల‌కు పెద్ద‌న్న‌లా వ్య‌వ‌హ‌రించే అమెరికా....అన్నిరంగాల్లోనూ ఓ అడుగు ముందంజ‌లో ఉంటుంది. తాజాగా, ప్ర‌పంచంలోని సంప‌న్న‌మైన దేశాల జాబితాలో కూడా అగ్ర‌రాజ్యానికే అగ్ర‌తాంబూలం అందింది. ప్ర‌పంచంలోని ధ‌నిక దేశాల‌లో అమెరికా ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. ఆ జాబితాలో భార‌త దేశం ఆరో స్థానంలో నిలిచింది.

ఆ దేశంలో నివ‌సించే ప్ర‌జ‌ల ప్రైవేటు ఆస్తుల(స్థిర‌, చ‌ర‌, న‌గ‌దు, వ్యాపారాలు)ను ప‌రిగ‌ణలోకి తీసుకొని ఈ జాబితాను ఆఫ్రో ఆసియా బ్యాంక్ గ్లోబ‌ల్ వెల్త్ మైగ్రేష‌న్ రివ్యూ రూపొందించింది. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను , నిధుల‌ను ఈ జాబితాలో  ప‌రిగ‌ణ‌లోకి తీసుకోమ‌ని ఆ బ్యాంకు చెప్పింది.

62, 584 బిలియ‌న్ డాల‌ర్ల ఆస్తుల‌తో అమెరికా ప్ర‌థ‌మ‌స్థానంలో ఉండ‌గా..... 24,803 బిలియ‌న్  డాల‌ర్ల ఆస్తుల‌తో చైనా రెండో స్థానంలో....19,522 బిలియ‌న్ డాల‌ర్ల్ ఆస్తుల‌తో జ‌పాన్ మూడో స్థానంలో నిలిచాయి. ఆ త‌ర్వాతి స్థానాల్లో.....యూకే(9919 బిలియ‌న్ డాల‌ర్లు), జ‌ర్మ‌నీ(9660 బిలియ‌న్ డాల‌ర్లు), భార‌త్(8230 బిలియ‌న్ డాల‌ర్లు), ఆస్ట్రేలియా(6142 బిలియ‌న్ డాల‌ర్లు), కెన‌డా (6393 బిలియ‌న్ డాల‌ర్లు), ఫ్రాన్స్(6649 బిలియ‌న్ డాల‌ర్లు), ఇట‌లీ(4276 బిలియ‌న్ డాల‌ర్లు) ఉన్నాయి. టాప్ -10 జాబితాలో భార‌త్ ఆరో స్థానం ద‌క్కించుకోవ‌డం విశేషం. వ్యాపార‌సంస్థలు, ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలు, రియ‌ల్ ఎస్టేట్, హెల్త్ కేర్ రంగాల్లో ఏటా 200 శాతం అభివృద్ధి ఉండ‌డంతోనే భార‌త్ కు ఆ స్థానం ద‌క్కింది. రాబోయే ప‌దేళ్ల‌లో అన్ని దేశాల్లో ఈ ఆస్తుల విలువ 50 శాతానికి పెరుగుతుంద‌ని అంచనా వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు