ఆవేశానికి పోయి దేశ‌మంతా ర‌చ్చచేసుకుంది

ఆవేశానికి పోయి దేశ‌మంతా ర‌చ్చచేసుకుంది

రాజ‌కీయం మునుప‌టి అంత సులువుగా లేదు. ఇపుడు అంద‌రూ స్మార్టే. 2014లో మోడీ వ‌చ్చిన‌పుడు అత‌ను ఎంత ముందు ఉన్నాడో కాంగ్రెస్ అంచ‌నావేయ‌లేదు. కానీ, కాంగ్రెస్ ఎంత వెనుక‌ప‌డిందో మోడీ అర్థం చేసుకున్నాడు. టైం చూసి మాట‌ల‌తో కాంగ్రెస్‌ను డ్యామేజ్ చేశాడు. క‌ట్ చేస్తే... స్వ‌ల్ప‌కాలంలోనే మోడీని అర్థం చేసుకుని కాంగ్రెస్ ముందుకెళ్లే ప్ర‌య‌త్నం చేసింది.

కానీ మోడీ మాత్రం కాంగ్రెస్ మీద అదే అంచ‌నాతో ఉన్నాడు. ఇదే ఈరోజు క‌ర్ణాట‌క‌లో అవ‌లీల‌గా చేతికి రావాల్సిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. కేవ‌లం బీజేపీ దూకుడు-ఆవేశ‌మే దీనికి కార‌ణం. ఇదెలాగో చూద్దాం.

కర్ణాట‌క‌లో 222 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. బీజేపీకి 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 38 సీట్లు వ‌చ్చాయి. ఒక్క ఆరు సీట్లు ద‌క్కి ఉంటే బీజేపీదే అధికారం. ఓట్ల శాతంలో చూసిన‌పుడు బీజేపీకి కాంగ్రెస్ కంటే త‌క్కువ ఆద‌ర‌ణే ఉన్న‌ప్ప‌టికీ సీట్ల ప‌రంగా మాత్రం మెజారిటీలో ఉంది. మ‌ణిపూర్‌, మేఘాల‌య‌, గోవా రాష్ట్రాల్లో పోస్ట్ పోల్ అల‌య‌న్స్‌తో ప్ర‌భుత్వాన్ని బీజేపీ ఆ లాజిక్ ఇక్క‌డ వ‌ర్తిస్తుందనే విష‌యం మ‌రిచిపోయింది. ఆ మూడు రాష్ట్రాల్లో బీజేపీ చేసింది మాయే అయినా రూల్ బుక్ లూప్ హోల్స్‌ను ఫాలో అయ్యింది. కానీ ఇక్క‌డ ఆవేశ ప‌డితే త‌న కంటితో త‌న వేలే పొడిచే అవకాశం ఉంద‌నే విషయం బీజేపీ మ‌రిచిపోయింది.

ఇపుడు బీజేపీకి అధికారం మాత్ర‌మే పోలేదు. ప‌రువు కూడా పోయింది. ఇక్క‌డ‌ బీజేపీ చేసిన పొర‌పాటు ఏంటంటే... తొంద‌ర‌పాటు. ఎప్ప‌టిలాగే మోడీ కాక‌మ్మ క‌బుర్లు చెప్పి కాంగ్రెస్‌-జేడీఎస్‌కు అధికారాన్ని వ‌దిలేసి ఉండాల్సింది. మెజారిటీ లేదు కాబ‌ట్టి మేము ప్ర‌భుత్వం ఏర్పాటుచేయం అని మంచిత‌నం న‌టించాల్సింది.

కాంగ్రెస్‌ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక ఎలాగూ కాంగ్రెస్‌లో అసంతృప్తులు స‌ర్వ‌సాధార‌ణం కాబ‌ట్టి నెల‌రోజుల్లోపు వారిని లాగేసి, లేక‌పోతే రిజైన్ చేయించి స‌భ‌లో అవిశ్వాసం పెట్టి ఉంటే ఆ స‌ర్కారు కూలిపోయేది. ఇక గ‌వ‌ర్న‌ర్ ఎలాగూ బీజేపీ వాడే కాబ‌ట్టి చాలా సాఫీగా సీఎం సీటు బీజేపీకి ద‌క్కేది. కానీ ఆవేశానికి పోయి దేశ‌మంతా ర‌చ్చచేసుకుంది. ఓటుకు నోటులో దేశ‌మంతా దోషిగా నిల‌బ‌డింది. ఇప్ప‌టికీ బీజేపీకి పైన చెప్పిన రూట్లో అధికారం చేజిక్కించుకునే అవ‌కాశం ఉన్నా... ఇపుడు జ‌రిగిన డ్యామేజీ నేప‌థ్యంలో బీజేపీ వెంట‌నే అధికారంలోకి వ‌స్తే బీజేపీ మ‌ళ్లీ దుర్మార్గానికి పాల్ప‌డింద‌నే ఫీల‌వుతారు జ‌నం.

ఇది మ‌రోసారి బీజేపీని డ్యామేజ్ చేస్తుంది. అధికారం ద‌క్కినా ఉప‌యోగం లేకుండా పోతుంది. ఆవేశ ప‌డ‌క‌పోయి ఉంటే వ్ర‌త‌మూ ద‌క్కేది, ఫ‌ల‌మూ ద‌క్కేది. మోడీ బ్యాచ్ బ్యాడ్ టైం అలా ఉంది మ‌రి. త‌ట‌స్థులు కూడా కాంగ్రెస్‌కు స‌పోర్ట్ చేసేటంత సానుభూతి మోడీ వ‌ల్ల‌ కాంగ్రెస్‌కు వ‌ర్క‌వుటైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు