కుమార‌స్వామి ప్ర‌మాణం ఈ రోజుకు ఎందుకు చేయ‌లేదు?

కుమార‌స్వామి ప్ర‌మాణం ఈ రోజుకు ఎందుకు చేయ‌లేదు?

ప్ర‌త్య‌ర్థి ఓట‌మిని అంగీక‌రించారు. బ‌లాన్ని నిరూపించేందుకు అవ‌స‌ర‌మైన సంఖ్యా బ‌లం తాము బ‌స చేయించిన హోట‌ళ్ల‌లో భ‌ద్రంగా ఉంది. విధి లేని వేళ‌.. గ‌వ‌ర్న‌ర్ సైతం ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరుతున్న ప‌రిస్థితి. మ‌రింత ఆల‌స్యం ఎందుకు?  కుమార‌స్వామి క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌టానికి ఎందుకు వెన‌క్కి త‌గ్గిన‌ట్లు?  సోమ‌వారం ప్ర‌మాణం చేసే అవ‌కాశం ఉన్నా.. బుధ‌వారానికి ఎందుకు వాయిదా వేసుకున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

దీనికి వెనుకున్న కార‌ణం సెంటిమెంట్ ది కావ‌టంతో.. కుమార‌స్వామి సీఎం అయ్యేందుకు మ‌రో రెండు రోజులు ఆగుతున్న‌ట్లుగా చెప్పాలి. క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి అన్ని అనుకూలంగా ఉన్న‌ప్ప‌టికీ.. కుమార‌స్వామి సీఎంగా ప్ర‌మాణం చేయ‌టానికి ఎందుకు ఆగిన‌ట్లు అన్న‌ది చూస్తే.. సోమ‌వారం మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ వ‌ర్ధంతి.

అలాంటి బాధాక‌ర‌మైన రోజున ప్రమాణం చేయ‌టం స‌రికాద‌న్న ఆలోచ‌నే ఆపింద‌ని చెబుతున్నారు. మంగ‌ళ‌వారం సెంటిమెంట్ తో రేప‌టి రోజును కూడా వాయిదా వేసి.. బుధ‌వారం ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని పెట్టుకోవాల‌ని డిసైడ్ చేశారు. మిత్ర‌ప‌క్షానికి చెందిన ముఖ్య‌నేత వ‌ర్థంతి రోజును ప్ర‌మాణ‌స్వీకారం చేసి పండ‌గ చేసుకోలేని కార‌ణంగానే రెండు రోజుల పాటు సీఎం ప‌ద‌విని చేప‌ట్ట‌కుండా కుమార‌స్వామి ఆగిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు