కాబోయే సీఎం వైఫ్ గురించి తెగ వెతికేస్తున్నార‌ట‌

కాబోయే సీఎం వైఫ్ గురించి తెగ వెతికేస్తున్నార‌ట‌

 నిన్న‌మొన్న‌టివ‌ర‌కూ పెద్ద‌గా ప‌రిచ‌యం లేని ఆమె గురించి.. ఇప్పుడు గూగుల్ సెర్చ్ లో  తెగ వెతికేస్తున్నార‌ట‌. ఇంత‌కీ ఆమె ఎవ‌రంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. గ‌డిచిన వారంలో గూగుల్ లో అత్య‌ధికంగా సెర్చ్ చేసిన పేర్ల‌లో ముందుంది రాధిక కుమార‌స్వామి. ఇప్ప‌టికే ఆమె ఎవ‌రో మీకు కాస్త అర్థ‌మై ఉంటుంది. నిజ‌మే.. మీ అంచ‌నా క‌రెక్టే. క‌ర్ణాట‌క‌కు కాబోయే ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి స‌తీమ‌ణే రాధిక కుమార‌స్వామి.

గ‌తంలో హీరోయిన్ గా ప‌లు చిత్రాల్లో న‌టించిన ఆమెను కుమార‌స్వామి రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమార్తె కూడా ఉన్నారు. 2006లో వీరి పెళ్లి జ‌రిగింది. రాధిక ప్ర‌ముఖ న‌టిగా క‌న్న‌డిగుల‌కు సుప‌రిచితురాలు. ఆమె న‌టిగా.. నిర్మాత‌గా ప‌లు చిత్రాలకు ప‌ని చేశారు.

2010లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత ర‌మ్య‌.. కుమార‌స్వామిల‌కు మ‌ధ్య ఏర్ప‌డ్డ వాగ్యుద్ధంతో ఆయ‌న చేసుకున్న రెండో పెళ్లి గురించిన వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో.. ఆయ‌న త‌న పెళ్లి ముచ్చ‌ట‌ను ఒప్పుకున్నారు. ఇక‌.. రాధిక విష‌యానికి వ‌స్తే.. ఆమె త‌న ప‌ద‌హారో ఏట‌నే సినీ రంగంలోకి అడుగుపెట్టారు.

త‌న ఎంట్రీతో శాండిల్ వుడ్‌ను ఊపేసిన ఆమె..  2006 లో ఒక చిత్రంలో న‌టించ‌గా.. త‌ర్వాతికాలంలో ఏడాదికి ఐదు సినిమాల‌కు త‌గ్గ‌కుండా న‌టించేవారు. మొత్తం 30 సినిమాల్లో న‌టించిన ఆమె.. టాలీవుడ్‌.. కోలీవుడ్ చిత్రాల్లోనూ న‌టించారు.

తాజాగా చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో రాధికా కుమార‌స్వామి అనే ప‌దం గూగుల్ ట్రెండ్స్ లో టాప్ లో నిలిచింది. అంతేనా..ఆ ట్రెండ్ ఒక్క భార‌త్‌లోనే కాదు.. ఖ‌త‌ర్‌.. యూఏఈ.. శ్రీ‌లంక‌.. కువైట్ లోనూ పెద్ద ఎత్తున నిల‌వ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు