పాక్‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన బీఎస్ఎఫ్‌ !

పాక్‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన బీఎస్ఎఫ్‌ !

పాకిస్థాన్‌కు మరోసారి ఇండియన్ ఆర్మీ పవరేంటో తెలిసొచ్చింది. చీటికీమాటికీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాక్ బలగాలకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్). దీంతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. గత కొద్ది రోజుల నుంచి పాకిస్థాన్ రేంజర్లు.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే.

పాక్ రేంజర్లు జరిపిన కాల్పులకు ఇద్దరు జవాన్లు.. పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్‌కు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు.. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న పాకిస్థాన్ బంకర్లను ధ్వంసం చేశారు. మే 19న బంకర్లను ధ్వంసం చేసినట్లు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మేరకు పాక్ బంకర్లను పేల్చేసిన 19 సెకన్ల నిడివి గల వీడియోను బీఎస్ఎఫ్ విడుదల చేసింది. ఈ వీడియో ప్ర‌కారం బీఎస్ఎఫ్ బలగాలు అంతేకాకుండా పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్‌కు గట్టిగా సమాధానం ఇచ్చాయి.

అంతర్జాతీయ సరిహద్దులో పాక్ బంకర్లపై భారత బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. జమ్ముకు 30 కిలోమీటర్ల దూరంలోని అఖ్నూర్ ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక చికెన్ నెక్ ఏరియాలో పాక్ బలగాలపై బీఎస్ఎఫ్ రాకెట్ దాడి చేసింది. బీఎస్ఎఫ్ చేసిన ఈ బీతావ‌హ దాడితో పాక్ రేంజ‌ర్ల‌కు మైండ్ బ్లాంక్ అయింది.  ఈ క్రమంలో పాక్ రేంజర్లు.. జమ్మూ బీఎస్ఎఫ్ అధికారులకు ఫోన్ చేసి కాల్పులు ఆపాలని కోరారు. దయచేసి కాల్పులు ఆపండి అంటూ పాక్ బలగాలు వేడుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. ``మూడు రోజులుగా బీఎస్ఎఫ్ బలగాలు పాక్ స్థావరాలపై విరుచుకుపడుతూనే ఉన్నాయి. దీంతో వాళ్లకు భారీ నష్టం వాటిల్లింది. ఓ రేంజర్ కూడా చనిపోయాడు`` అని ఆ అధికారి తెలిపారు.  ``వాళ్లు మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటే అదే స్థాయిలో సమాధానమిస్తాం. పాక్‌లో పంట కోతలు ఈ మధ్యే పూర్తయ్యాయి. దీంతో వాళ్లు ఇలాంటి పనేదో చేస్తారని ముందే ఊహించి సిద్ధంగా ఉన్నాం``అని బీఎస్ఎఫ్ ఐజీ రామ్ అవ్‌తార్ చెప్పారు.

ఇదిలాఉండ‌గా... పాక్ రేంజర్లు జరుపుతున్న కాల్పులకు సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాలను ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోర్టార్స్‌తో దాడులు చేయడం వలన ఇండ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో పాక్ జరిపిన కాల్పులకు 38 మంది మృతి చెందారు. వీరిలో 18 మంది జవాన్లు ఉన్నారు. గత మూడు రోజుల నుంచి పాకిస్థాన్ స్థావరాలపై భారత బలగాలు తీవ్రంగా దాడి చేయ‌డంతో పాక్ ఎట్ట‌కేల‌కు కాళ్ల‌బేరానికి వ‌చ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు