ర‌మ‌ణ దీక్షితులు..రిచ్‌నెస్ చూస్తే షాక‌వ్వాల్సిందే

ర‌మ‌ణ దీక్షితులు..రిచ్‌నెస్ చూస్తే షాక‌వ్వాల్సిందే

తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులు రమణ దీక్షితులు కామెంట్స్‌ కలకలం రేపుతున్నాయి. తొలగింపునకు గురైన రమణ దీక్షితులు తన మాటలకు పదును పెడుతున్నారు. శ్రీవారి సంపదకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారి నైవేద్యం నుంచి మొదలుకొని.. కానుకల వరకు  అసలేం జరుగుతోందో విన‌డంటూ వెల్ల‌డించారు. శ్రీవారి సంపదకు రక్షణ లేదనే భయంతోనే తాను కొన్ని విషయాలు బయటకి చెప్పానని చెప్పారు. తన జీవితాంతం స్వామివారి సేవలో గడిపానని.. నిజాలు చెప్పినందుకే తనపై కక్ష సాధింపు ప్రక్రియ ప్రారంభమైందని విమర్శించారు.

అయితే, జీవితాంతం సేవ చేసిన అని చెప్తున్న ర‌మ‌ణ దీక్షితులు సేవ సంగ‌తి ఏమోకానీ చాలా రిచ్‌గా త‌న జీవితం గ‌డిపేశార‌ని కొంద‌రు దుయ్య‌బ‌డుతున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నంగా ఆయ‌న పేరిటి ఉన్న ఆస్తుల వివ‌రాల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. తిరుప‌తి ఆర్‌టీఏ కార్యాల‌యంలో న‌మోదైన వివ‌రాల ప్ర‌కారం ర‌మ‌ణ దీక్షితుల పేరుతో ఓ ఆడి కారు న‌మోదు అయి ఉంది. AP09VQTR6607 అనే పేరుతో రిజిస్ట్ర‌ర్ అయి ఉన్న ఈ కారు ర‌మ‌ణ దీక్షితులు పేరుతో ఉండ‌టం కొత్త అనుమానాల‌కు తావిస్తోంది. టీటీడీ ద్వారా వ‌చ్చిన జీతంతో ఆడి కారును కొనేశారా? అనే సందేహం ప‌లువురి నుంచి స‌హ‌జంగానే వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రోవైపు ఆయ‌న పేరుతో రెండు భ‌వ‌నాలు కూడా రిజిస్ట్రర్ అయి ఉండ‌టం ఆస‌క్తిక‌రం.

కాగా, ఈ ఆస్తుల వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చిన నేప‌థ్యంలో ర‌మ‌ణ‌దీక్షితులు తీరుపై టీడీపీ అభిమానులే కాదు..సామాన్యులు సైతం అనుమాన‌పు చూపులు చూస్తున్నారు. నిజంగా దేవుడి స‌న్నిధిలో ఉన్న వ్య‌క్తి ఇలాంటి ఆస్తులు ఎలా కూడ‌బెట్టుకోగ‌లిగార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ర‌మ‌ణ దీక్షితులు తొల‌గింపు విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు ఏదో అన్యాయం జ‌రిగినపోయిన‌ట్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని అయితే ఈ వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చిన త‌ర్వాత అయినా ఆయ‌న‌కు గుడ్డిగా మ‌ద్ద‌తిస్తారా?  లేదా దీక్షితులు గారు మీపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వండి అని కోరుకుంటారా అంటూ ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి విప‌క్షాలు ఏం స‌మాధానం చెప్తాయో మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు