టిఆర్‌ఎస్‌ వంద గెలిస్తే...

టిఆర్‌ఎస్‌ వంద గెలిస్తే...

తెలంగాణ రాష్ట్ర సమితికి సాధారణ ఎన్నికల్లో ఎప్పుడూ అంత గొప్ప ఫలితాలు రాలేదు. కాని అంచనాలు, సర్వేలు ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితికి ఫలితాలు గొప్పగా ఉంటాయని చెప్పడంతో ఆ పార్టీ వర్గాలలో ఆనందం వ్యక్తమవుతున్నది. వంద అసెంబ్లీ సీట్లు గెలుస్తామనే ధీమా టిఆర్‌ఎస్‌ అధినేతలో ఇంకా పెరుగుతూ వస్తుండగా, దానికి తగ్గట్టుగానే సర్వేలూ టిఆర్‌ఎస్‌ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నాయి.

11 వరకు తెలంగాణలో ఎంపి సీట్లు టిఆర్‌ఎస్‌కి రావొచ్చని తాజా సర్వే ఒకటి చెప్పింది. 11 ఎంపీ సీట్లు గెలిస్తే, 100 అసెంబ్లీ సీట్లు గెలవడం కష్టం కాకపోవచ్చు టిఆర్‌ఎస్‌కి. ఒకవేళ 100 సీట్లు టిఆర్‌ఎస్‌ గెలిచినట్లయితే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటవ్వాలన్నా అది టిఆర్‌ఎస్‌ కనుసన్నల్లోనే జరగాల్సి ఉంటుంది. అంటే టిఆర్‌ఎస్‌ 100 సీట్లు గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆ పార్టీనే నిర్ణయించే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. కాని అది సాధ్యమా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు