శ్రీదేవిని పథకం ప్రకారం చంపారు : రిటైర్డు ఏసీపీ

శ్రీదేవిని పథకం ప్రకారం చంపారు : రిటైర్డు ఏసీపీ

వెండి తెరపై ఎప్పటీకి పదహారణాలా తెలుగు అమ్మాయిగా కనిపించే సిరిమల్లె పువ్వు శ్రీదేవి ఆకస్మిక మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలింది.  ఫ్రిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగి చనిపోయినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలిపారు.  అయితే అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మనరణంపై మ‌రో సంచ‌ల‌న వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. ఢిల్లీకి చెందిన వేద్ భూష‌ణ్ అనే మాజీ ఏసీపీ శ్రీదేవిని ప‌థ‌కం ప్ర‌కారం చంపార‌ని ఆరోపించారు. ఆయ‌న వ్యాఖ్యలు ప్ర‌స్తుతం క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఏసీపీగా ప‌దివీ విర‌మ‌ణ పొందిన వేద్ భూషణ్ ప్ర‌స్తుతం ఢిల్లీలో ఓ ప్రైవేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీని నడుపుతున్నారు. శ్రీదేవి మృతిపై అనుమానం వ్య‌క్తం చేసిన ఆయ‌న కొన్ని సందేహాల‌ను పేర్కొంటూ మీడియా ముందుకు వ‌చ్చారు.

``శ్రీదేవి ప్ర‌మాద‌వ‌శాత్తు బాత్ ట‌బ్‌లో మునిగి చ‌నిపోలేదు. ఎవ‌రో పక్కా ప్లాన్‌తోనే ఆమెని చంపేశారు. బాత్‌ట‌బ్‌లో బ‌ల‌వంతంగా ముంచి చంప‌డం చాలా తేలిక. అలా చేస్తే మునిగి చ‌నిపోయారని చెప్పి నిందితులు త‌ప్పించుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. నాకు మాత్రం ఆమెని ప‌థ‌కం ప్ర‌కార‌మే చంపార‌ని అనిపిస్తుంది. దుబాయ్‌ వైద్యులు ఇచ్చిన ఫోరెన్సిక్‌ నివేదికపై నాకు సందేహాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం`` అని భూషణ్  పేర్కొన్నారు. కాగా, ఈ న ప్ర‌క‌ట‌నపైశ్రీ‌దేవి కుటుంబ స‌భ్యుల స్పంద‌న వెలువ‌డాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English