ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన జ‌గ‌న్‌

ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన జ‌గ‌న్‌

వ‌రుస హామీల‌తో ఏపీ అధికార‌ప‌క్ష అధినేత‌కు నిద్ర లేకుండా చేస్తున్న ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాజాగా మ‌రో హామీ ఇచ్చారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాదిరి కాకుండా.. ప్ర‌తి వ‌ర్గానికి సంబంధించిన వారి స‌మ‌స్య‌ల్ని క్షుణ్ణంగా తెలుసుకున్న త‌ర్వాతే హామీ ఇస్తున్న జ‌గ‌న్ .. తాజాగా త‌న ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో భాగంగా ఆటో డ్రైవ‌ర్ల‌కు ఊహించ‌ని రీతిలో హామీ ఇచ్చి వారిని ఉక్కిరిబిక్కిరి చేశారు.

పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ ప్ర‌స్తుతం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఆయ‌న్ను ఆటో డ్రైవ‌ర్లు క‌లిశారు. త‌మ స‌మ‌స్య‌ల్ని చెప్ప‌కున్నారు. ఈ సంద‌ర్భంగా స్పందించిన జ‌గ‌న్‌.. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఏపీలోని ప్ర‌తి ఆటో డ్రైవ‌ర్ కు ఏడాదికి రూ.10000 చొప్పున చెల్లిస్తామ‌ని చెప్పారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలోని మేదిన‌రావు పాలెం వ‌ద్ద జ‌గ‌న్ మ‌రో ఆస‌క్తికర ప‌రిణామానికి కార‌ణ‌మ‌య్యారు.

ఆటో డ్రైవ‌ర్ల ఖాకీ చొక్కా వేసుకున్న జ‌గ‌న్ .. ఆటోను న‌డిపారు. జ‌గ‌న్ స్వ‌యంగా ఆటో డ్రైవ్ చేయ‌టంతో ఆటో డ్రైవ‌ర్లు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జ‌గ‌న్ హామీపై ఆటోవాలాలు స్పందించారు. ఆయ‌న అంద‌రివాడ‌ని.. ప్ర‌తి ఒక్క వృత్తిదారుడికి.. ప్ర‌తి సామాజిక వ‌ర్గానికి అండ‌గా ఉండేలా హామీ ఇస్తున్న‌ట్లు చెప్పారు. సొంత ఆటో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి ఏడాదికి రూ.10వేలు చొప్పున ఇస్తాన‌న్న హామీ త‌మ‌కు ఎంతో సాయంగా మారుతుంద‌ని చెప్పారు. జ‌గ‌న్ త‌మ గుండె లాంటి ఆటో న‌డిపారంటూ సంతోష‌ప‌డ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English