బాలీవుడ్ రాహుల్‌... ఉదయ్ చోప్రా !

బాలీవుడ్ రాహుల్‌... ఉదయ్ చోప్రా   !

కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్ విజయవంతంగా మరో రాష్ర్టంలో మెజార్టీ సీట్ల‌ను బీజేపీకి కోల్పోయింది. దీంతో దేశంలో ఇప్పుడు సొంతంగా, మిత్రపక్షాలతో కలిపి మొత్తం 21 రాష్ర్టాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. తాజా ఓటమితో ట్విట్టర్‌లో రాహుల్‌గాంధీతో నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఆయనపై జోకులు పేలుతున్నాయి. రకరకాలు ఫన్నీ కామెంట్లతో ట్విట్టర్ హోరెత్తుతోంది. మ‌రోవైపు రాహుల్‌గాంధీని బాలీవుడ్‌కు కూడా క‌నెక్ట్ చేసి కామెంట్లు చేస్తున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోగానే ట్విట్టర్‌లో నెటిజన్లు రాహుల్‌గాంధీతో ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఆయన వల్ల కాదు ప్రియాంకాను తీసుకురావాలని కాంగ్రెస్ కార్యకర్తలే పట్టుబట్టారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడలాంటి రాహుల్‌గాంధీ బాలీవుడ్‌లోనూ ఉన్నాడని ట్విట్టర్ కామెంట్ చేసింది. ఇంతకీ అతని పేరేంటో తెలుసా ఉదయ్ చోప్రా. ఇతన్ని రాహుల్‌తో పోల్చడానికి ఓ పెద్ద కారణమే ఉంది. కర్ణాటక ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ ఎవరికీ రాకపోవడంతో జేడీఎస్‌కు కాంగ్రెస్ మద్దతిచ్చిన విషయం తెలుసు కదా. ఈ విషయంలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీని పిలవాలా లేక జేడీఎస్, కాంగ్రెస్‌కు అవకాశమివ్వాలన్న విషయంలో గవర్నర్ వాజుభాయ్ వాలాదే కీలకపాత్ర కానుంది. అయితే ఈయన బీజేపీ మనిషి అని, ఒకప్పుడు మోడీ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారని అందరికీ తెలిసిన విషయమే. దీనిని ఇప్పుడే తాను కనిపెట్టినట్లు వాజుభాయ్ వాలా వివరాలను గూగుల్‌లో తెలుసుకొని ఆయన బీజేపీ మనిషి అంటూ తేల్చాడు ఉదయ్ చోప్రా. దీనినే అతను ట్వీట్ చేయడంతో ఇక నెటిజన్లు ఓ ఆటాడుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు