బీజేపీకి ఎవ‌రి సాయం అక్క‌ర్లేదా?

బీజేపీకి ఎవ‌రి సాయం అక్క‌ర్లేదా?

అధికారికంగా ఒక్క ఫ‌లితం వెలువ‌డ‌న‌ప్ప‌టికీ.. అధిక్య‌త‌ల్ని చూస్తే క‌ర్ణాట‌క తుది ఫ‌లితం మీద క్లారిటీ వ‌చ్చేసినట్లే. ఒక‌ర‌కంగా చూస్తే.. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై వెలువ‌డిన ఎగ్జిట్ పోల్స్ కు భిన్న‌మైన ఫ‌లితాన్ని క‌న్న‌డ ఓట‌ర్లు ఇచ్చార‌ని చెప్పాలి.

మొత్తం 222 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇప్ప‌టివ‌ర‌కూ వెలువ‌డిన అధిక్య‌త‌ను చూస్తే.. బీజేపీ 105 నుంచి 108 స్థానాల్లో అధిక్య‌త‌ను నిలిచిన‌ట్లు తేలింది. మ‌రో 5 స్థానాల‌కు సంబంధించిన ఫ‌లితాలు ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. ఈ లెక్కన చూసిన‌ప్పుడు ప్ర‌స్తుతం అధిక్య‌త‌లో ఉన్న బీజేపీదే అధికార పీఠం అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఫ‌లితాల వెల్ల‌డైన మొద‌ట్లో కాంగ్రెస్‌.. బీజేపీల మ‌ధ్య వ్య‌త్యాసం స్వ‌ల్పంగా ఉన్న‌ప్ప‌టికీ.. త‌ర్వాత త‌ర్వాత మాత్రం తేడా అంత‌కంత‌కూ పెరిగిపోయింది.

ఇప్పటివ‌ర‌కూ వెల్ల‌డైన అధిక్య‌త‌లు చూస్తే అతి పెద్ద పార్టీగా బీజేపీ అవ‌త‌రించింది. అంతేనా.. ట్రిపుల్ డిజిట్ ను బీజేపీ దాటేయ‌గా.. ఆ మార్క్ కు ద‌రిదాపుల్లోకి సైతం కాంగ్రెస్ రాని ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్ప‌టివ‌ర‌కూ వెలువ‌డిన ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం హంగ్ అన్న మాట‌లో అర్థం లేద‌ని.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి నాలుగైదు సీట్లు మాత్ర‌మే బీజేపీ అవ‌స‌రం కావొచ్చేమోన‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

అదే స‌మ‌యంలో ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్ కు త‌గ్గ‌ట్లే.. చివ‌రి రౌండ్ల‌లో తేడా వ‌చ్చి.. బీజేపీకి మ‌రికొన్ని సీట్లు క‌లిస్తే క‌మ‌ల‌నాథులు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టివ‌ర‌కూ కింగ్ మేక‌ర్ అనుకుంటున్న జేడీఎస్ కు ఇప్పుడు దిక్కుతోచ‌ని ప‌రిస్థితే. త‌న అవ‌స‌రం వ‌స్తే తానేంటో చూపించాల‌నుకున్న జేడీఎస్ కు క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు ఆ అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని చెప్పాలి.  ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే.. బీజేపీ సొంతంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English