జ‌గ‌న్ వ‌ల్లే ఫేమ‌స్ అయ్యా.... కానీ ఆ పాపులారిటీ వ‌ద్దు

జ‌గ‌న్ వ‌ల్లే ఫేమ‌స్ అయ్యా.... కానీ ఆ పాపులారిటీ వ‌ద్దు

తెలుగు నేల‌పై రికార్డ్ స్థాయి అవినీతిగా చ‌రిత్ర‌పుటల్లోకి ఎక్క‌డ‌మే కాకుండా...దేశం అంత‌టిని ఆశ్చ‌ర్య‌పోయేలా సాగిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ అక్ర‌మాస్తుల ఆరోప‌ణ‌ల ప‌ర్వం కొత్త మ‌లుపు తిరిగింది. ఈ కేసు ముగింపు ఎలా ఉంటుందో అనే చ‌ర్చోప‌చ‌ర్చ‌ల నేప‌థ్యంలో ఈ సంచ‌ల‌న అవినీతి ప‌ర్వాన్ని ద‌ర్యాప్తు చేసిన సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ కేసు విష‌యంలో ముగింపు ఎలా ఉంటుందో ఊహించ‌లేమ‌ని అన్నారు. ఆ కేసు ద‌ర్యాప్తు నీరుగారిపోతోందా అనే అంశంపై త‌ను స్పందించ‌డం స‌రికాద‌ని ఓ టీవీ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ల‌క్ష్మీనారాయ‌ణ తెలిపారు.

వైఎస్ జ‌గ‌న్ కేసుల‌ను విచార‌ణ చేయ‌డం వ‌ల్లే త‌న‌కు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ వ‌చ్చింద‌నే విష‌యాన్ని అంగీక‌రించిన సీబీఐ మాజీ జేడీ అయితే తాను అది కోరుకోవ‌డం లేద‌ని అన్నారు. ఈ కేసు విష‌యంలో ప్రచారానికి వాస్త‌వానికి మ‌ధ్య తేడా ఉంద‌న్నారు. ఆ కేసును ద‌ర్యాప్తు చేయాల‌ని త‌న‌పై ఒత్తిళ్లు వ‌చ్చింద‌నే దాంట్లో నిజం లేద‌న్నారు. అస‌లు నాకు ఆ కేసును అప్ప‌గించింది కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం కాద‌ని, హైకోర్ట్ బెంచ్ అని తెలిపారు. తాను ప‌నిచేసిన స‌మ‌యంలో ఎలాంటి ఒత్తిళ్లు రాలేద‌ని ల‌క్ష్మీనార‌యణ వెల్ల‌డించారు. త‌ను కేసు విచార‌ణ చేప‌ట్టిన స‌మ‌యంలో సాక్ష్యాధారాల ప్ర‌కార‌మే డ్యూటీ చేశాన‌ని ఆయ‌న వివ‌రించారు.

కాగా సీబీఐ జ‌గ‌న్ కేసును నీరుగారుస్తోంద‌ని, ప‌లువురు అధికారులు ఈ కేసు నుంచి బ‌య‌ట‌కు రావ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌నే విష‌యాన్ని ప్ర‌స్తావించ‌గా తాను దీనిపై స్పందించ‌లేన‌ని అన్నారు. త‌ను గ‌తంలో ఏ విధంగా ప‌నిచేశానో...ఇప్పుడున్న అధికారులు కూడా అదే రీతిలో ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని అన్నారు. కాగా, త‌న భ‌విష్య‌త్, రాజ‌కీయాల్లో చేర‌డం గురించి ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఆయ‌న వివ‌రించారు. రెండున్నర నెలల్లో ఏపీ అంతా పర్యటించి ఎప్పటికప్పుడు సమస్యలను ఆయా శాఖల అధికారుల దృష్టికి లేఖల రూపంలో తీసుకెళ్తానని చెప్పారు. పర్యటన అనంతరం భవిష్యత్‌ ప్రణాళిక నిర్దేశించుకుంటానని వెల్లడించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు