పోలీస్ స్టేష‌న్ లో చెప్పుతో కొట్టిన శ్రీ‌రెడ్డి బ్యాచ్

పోలీస్ స్టేష‌న్ లో చెప్పుతో కొట్టిన శ్రీ‌రెడ్డి బ్యాచ్

బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్లో ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది. ఒక అమాయ‌కురాలికి సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తాన‌ని చెప్పి మోసం చేసిన మోస‌గాడిపై పోలీస్ స్టేష‌న్లోనే చెప్పు దాడి జ‌రిగింది. ఈ వ్య‌వ‌హారంలో బాధితురాలితో పాటు సినీ న‌టి శ్రీ‌రెడ్డి మ‌రికొంద‌రు ఉన్నారు. సినిమాల్లో ఛాన్స్ ఇస్తాన‌న్న పేరుతో మోసం చేయ‌టం.. మ‌త్తు క‌లిపిన డ్రింక్ ఇచ్చి అత్యాచారం చేయ‌టం.. న‌గ‌లు.. న‌గ‌దుతో ఉడాయించ‌టం లాంటి ప‌లు త‌ప్పులు చేసిన వ్య‌క్తిని పోలీస్ స్టేష‌న్లోనే చెప్పుతో కొట్టిన వైనం సంచ‌ల‌నంగా మారింది.


ప్ర‌కాశం జిల్లా పుల్లెల చెరువు మండ‌లం మానేప‌ల్లికి చెందిన శ్రీ‌శాంత‌రెడ్డి సిటీకి వ‌చ్చి సినీ కో-ఆర్డినేట‌ర్ గా ప‌ని చేస్తున్నాడు. గ‌త ఏడాది ఒక మ‌హిళా ఆర్టిస్ట్ ప‌రిచ‌య‌మైంది. సినిమాల్లో అవ‌కాశం ఇస్తాన‌ని న‌మ్మించాడు. డిసెంబ‌రు 10న ఆమె ఇంటికి వెళ్లిన అత‌డు.. మ‌త్తుమందు ఇచ్చిన ఫ్రూట్ జ్యూస్ ను త‌న‌తో తీసుకెళ్లి న‌మ్మించి తాగించాడు. అనంత‌రం ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అనంత‌రం ఇంట్లో ఉన్న 40 తులాల బంగారం.. రూ.5ల‌క్ష‌ల‌తో పారిపోయాడు.

స్పృహ వ‌చ్చిన త‌ర్వాత త‌న‌కు జ‌రిగిన అన్యాయం గురించి ప్ర‌శ్నించిన బాధితురాలు.. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని కోర‌గా నో చెప్పాడు. ఇదిలా ఉండ‌గా అత‌డిపై ఫిర్యాదు చేయ‌టానికి బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్ కు వ‌చ్చారు. ఆమెకు సాయంగా సినీ న‌టి శ్రీ‌రెడ్డి.. సోనారాథోడ్‌.. రాగ‌సృతి.. సునీతారెడ్డి త‌దిత‌రులు వ‌చ్చారు. 
అదే స‌మ‌యంలో బాధితురాలి మీద రివ‌ర్స్ లో ఫిర్యాదు చేయ‌టానికి స్టేష‌న్ కు వ‌చ్చాడు శ్రీ‌శాంత్ రెడ్డి.  అత‌ని తీరుపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న బాధితురాలు చెప్పుతో అత‌న్ని కొట్టారు. ఇదే స‌మ‌యంలో మిగిలిన కొంద‌రు ఆర్టిస్టులు నిందితుడిపైకి దూసుకెళ్లారు.

ఊహించ‌ని రీతిలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో పోలీస్ స్టేష‌న్లో ఏం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. సినిమా ఆర్టిస్ట్ ల‌ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్ర‌యాస‌కు గుర‌య్యారు. ఈ సంద‌ర్భంగా స్వ‌ల్ప ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు శ్రీ‌శాంత్ రెడ్డిపై కేసు న‌మోదు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు