ఆ పెళ్లికి అనుకోని అతిథి కేసీఆర్

ఆ పెళ్లికి అనుకోని అతిథి కేసీఆర్

క‌రీంన‌గ‌ర్ జిల్లా శంక‌ర‌ప‌ట్నం మండ‌లం త‌డిక‌ల్ గ్రామం. ఓ ఇంట్లో పెండ్లి జ‌రుగుతుంది. అటుగా వెళ్తున్న భారీ కాన్వాయ్ హ‌ఠాత్తుగా ఆగిపోయింది. ఆ కాన్వాయ్ లోని వ్య‌క్తి వాహ‌నం దిగి న‌డుచుకుంటూ పెండ్లి మండ‌పంలోకి అడుగుపెట్టారు. చూస్తే ఆ వ్య‌క్తి తెలంగాణ‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి. ఆయ‌నే కేసీఆర్. ఊహించ‌ని ఈ సంఘ‌ట‌న‌ పెండ్లి మండ‌పంలోని అంద‌రినీ సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురిచేసింది. న‌వ దంప‌తుల ఆనందం అయితే అంతా ఇంతా కాదు.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఈరోజు ఉదయం రైతుబంధు పథకాన్ని ప్రారంభించ‌డానికి వెళ్లిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ అటుగా వెళ్తుండ‌గా పెళ్లి జ‌రుగుతున్నది చూసి కాన్వాయ్ ని ఆపి పెండ్లి మండపంలోని వెళ్లారు. నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించి అభినంద‌న‌లు తెలిపారు. క‌ళ్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కం కింది ప్ర‌భుత్వం నుండి స‌హాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

పెళ్లి అనేది జీవితంలో ముఖ్య ఘట్టం అయితే ఆ పెళ్లికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాక త‌మ‌కు జీవితంలో మ‌ర‌చిపోలేని అనుభూతి అని న‌వ‌దంప‌తులు కావ్య‌, మ‌నోహ‌ర్ లు అన్నారు. ఈ సంధ‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రి ఈటెల రాజేంద‌ర్ ల‌కు వారు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు