ప‌వ‌న్ జిల్లాల టూర్ రెడీ..ఇప్పుడు అదే స్పెష‌ల్‌

ప‌వ‌న్ జిల్లాల టూర్ రెడీ..ఇప్పుడు అదే స్పెష‌ల్‌

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ ఇందుకు త‌గిన కార్యాచ‌ర‌ణ‌ను మొద‌లుపెట్టారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. వాస్త‌వానికి గ‌త నెల‌ 21, 22, 23 తేదీల్లో చిత్తూరు, గుంటూరు జిల్లాలో పర్యటించాలని షెడ్యూల్ చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఈ పర్యటనలపై కొన్ని దృష్ట శక్తులు దృష్టి పడిందని..అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పర్యటనను రద్దు చేసుకోవాలని పోలీస్ నిఘా వర్గాలు జనసేన పార్టీకి హెచ్చరికలు జారీ చేశాయ‌ని పేర్కొంటూ గతంలో జరిగిన తుని వంటి విధ్వంసకర చర్యలకు పాల్పడి పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలని చుస్తున్నారని, ఇందుకోసం పక్క రాష్ట్రాల నుండి కిరాయి మనుషులతో సంప్రదింపులు జరిపినట్లు మాకు సమాచారం అందిందని పోలీస్ నిఘా వర్గాలు తెలిపాయి కాబ‌ట్టి వాయిదా వేసుకున్న‌ట్లు వివ‌రించారు.

అయితే తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మ‌య్యారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తన పర్యటన ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే ఈ నెల 13వ తేదీ నుంచి ఏపీలో పర్యటించనున్న పవన్... ప్రతీ నియోజకవర్గంలో రోడ్‌షోలు, ముఖ్యమైన పట్టణాలలో పాదయాత్రలు చేయాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ పర్యటన ఎలా సాగుతోంది... ఎక్కడి నుంచి ప్రారంభం కానుందనేది ఈ నెల 11వ తేదీన ప్రకటించనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలని నిలదీయాలని నిర్ణయించిన ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం తీరుపై కూడా మండిప‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండ‌గా...ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న కోసం జ‌న‌సేన ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. రెండు ప్ర‌త్యేక వాహ‌నాల‌ను స‌మ‌కూరుస్తున్న‌ట్లు స‌మాచారం. ఇవి పూర్తిగా ప‌వ‌న్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌ అవ‌స‌రాల‌కు ఉప‌యోగించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ప‌వ‌న్ వెంట ఉండే సిబ్బంది, ఇతరాల‌కు క‌లిపి మ‌రో వాహ‌న శ్రేణి ఉండ‌నుంద‌ని స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు