మోదీపై ప్ర‌కాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్!

మోదీపై ప్ర‌కాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్!

ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు, ర‌చ‌యిత్రి గౌరీ లంకేష్ హ‌త్యోదంతం అనంత‌రం బీజేపీ, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. జ‌స్ట్ ఆస్కింగ్ పేరుతో సంద‌ర్భానుసారంగా మోదీపై ప్ర‌కాష్ రాజ్ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. ఓ ద‌శ‌లో ప్ర‌కాష్ రాజ్...కాంగ్రెస్ త‌ర‌ఫున క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో దిగుతార‌ని పుకార్లు కూడా వ‌చ్చాయి.

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోన్న నేప‌థ్యంలో మోదీపై ప్ర‌కాష్ రాజ్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశ ప్ర‌జ‌లు కుక్క‌ల‌లాగా బ్ర‌తుకుతున్నార‌ని మోదీ అనుకుంటున్నారా అని ప్ర‌కాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మోదీ ఎన్ని అబ‌ద్ధాలు చెప్పారో గుర్తుందా అని ఎద్దేవా చేశారు. మోదీని ఉద్దేశించి ప్ర‌కాష్ రాజ్ సోష‌ల్ మీడియాలో చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యాయి.

ఆదివారం హుబ్లీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత‌ల‌పై మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొంద‌రికి దేశ‌భ‌క్తి గురించి మాట్లాడ‌డం ఇష్ట‌ముండ‌ద‌ని కాంగ్రెస్ ను ఉద్దేశించి అన్నారు. భారతీయ సైన్యంలో సేవలందిస్తోన్న ఉత్తర కర్ణాటకకు చెందిన ముధోల్‌ శునకాల నుంచైనా కాంగ్రెస్‌ పార్టీ దేశభక్తి నేర్చుకోవాలంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి.

ఈ నేపథ్యంలో మోదీపై ప్ర‌కాష్ రాజ్ మండిప‌డ్డారు. మనుషుల కన్నా ముధోల్ శునకాలు బాగా పనిచేస్తాయని ప్ర‌ధాని అన్నార‌ని, అయితే, కుక్కలు ఓట్లు వేయవని ప్ర‌కాష్ రాజ్ ఎద్దేవా చేశారు. ఉద్యోగాల కోసం యువత కలలు కంటోంద‌ని, రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నార‌ని చెప్పారు. క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు అంతా గ‌మ‌నిస్తున్నార‌ని, అక్క‌డి ప్ర‌జ‌లు కుక్కల లాగా  బ్రతుకుతున్నామని మీరు అనుకుంటున్నారా..జస్ట్ ఆస్కింగ్ అంటూ మోదీపై ప్ర‌కాష్ రాజ్ నిప్పులు చెరిగారు. ప్ర‌ధాని చెప్పే అబద్ధాలు త‌మ‌కు క‌రెంట్ క‌న్నా ఎక్కువ షాక్ ఇస్తున్నాయ‌ని అన్నారు. దేశంలో గ్రామాల సంఖ్య‌ను, ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌ధాని చెప్పిన అబద్ధాల‌ సంఖ్యను ప్ర‌ధాని మ‌ర‌చిపోయారని ఎద్దేవా చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English