ప్రకాష్ రాజ్‌కు పంచ్.. వీడియో వైరల్

ప్రకాష్ రాజ్‌కు పంచ్.. వీడియో వైరల్

దాదాపు ఏడాది నుంచి కేంద్రంలోని మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలతో చెలరేగిపోతున్నాడు ప్రకాష్ రాజ్. తన స్నేహితురాలైన జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులే కారణమని ఆరోపించిన ఆయన.. ఈ విషయంలో మోడీ స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. ఆ తర్వాత అంశాల వారీగా మోడీ సర్కారును టార్గెట్ చేశారు. పలు చర్చా కార్యక్రమాల్లో పాల్గొని మోడీని.. భారతీయ జనతా పార్టీని ఉతికారేస్తూ వచ్చారు. చాలా చర్చా కార్యక్రమాల్లో ప్రకాష్ రాజ్ పైచేయి సాధిస్తూ వచ్చారు.

కానీ తాజాగా నిర్వహించిన ఓ డిస్కషన్లో మాత్రం ప్రకాష్ రాజ్‌కు గట్టి పంచ్‌లే తగిలాయి. ఎంతటి వాళ్లనైనా తన వాగ్ధాటితో ఆత్మరక్షణలో పడేయగల భాజపా సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి.. ప్రకాష్ రాజ్‌ను ఆటాడుకున్నారు.

ఇండియాను హిందూ దేశంగా మార్చాలని మీరు ప్రయత్నిస్తున్నారా.. మరి వివిధ ముస్లిం దేశాలు మన హిందువుల్ని వెళ్లగొడితే పరిస్థితి ఏంటి అని ప్రకాష్ రాజ్ ప్రశ్న లేవనెత్తాడు. దీనికి సుబ్రమణ్యస్వామి ఘాటుగా బదులిచ్చారు. అసలు ఇండియా నుంచి ముస్లింలు.. ఇతర మతాల వాళ్లు వెళ్లిపోవాలని ఎవరంటున్నారు అని ప్రశ్నించారు. హిందువులకే ఇక్కడ సరైన రక్షణ లేదని.. వాళ్లు సంఘటితం కావాలని.. వాళ్లపై వివక్ష పోవాలని మాత్రమే తాము అంటున్నామని అన్నారు.

అసలు ఇండియాలో ముస్లింలు ఇతర మతాల వాళ్లు ఉన్నంత సౌకర్యవంతంగా పాకిస్థాన్‌లో లేదా ఒక గల్ఫ్ దేశంలో.. ఇతర ముస్లిం దేశాల్లో హిందువులు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. ఈ దేశాల్లో ఒక హిందూ గుడి కట్టే అవకాశముందా అని ప్రశ్నించారు. ఒకప్పుడు ముస్లింలు భారత దేశాన్ని పాలించినపుడు 47 వేల దేవాలయాల్ని ధ్వంసం చేయడం గురించి మీలాంటి సూడో సెక్యులరిస్టులు ఎప్పుడూ ఎందుకు ప్రశ్నించరని సుబ్రమణ్యస్వామి నిలదీశారు. దీంతో ప్రకాష్ రాజ్ సమాధానం చెప్పలేక తడబడ్డాడు. సుబ్రమణ్యస్వామి ప్రకాష్‌ రాజ్‌ గాలి తీస్తున్న ప్రతిసారీ ఆడిటోరయం చప్పట్లతో హోరెత్తిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English