ఆంధ్రాకు బీజేపీ మ‌ర‌ణ శాస‌నం !

ఆంధ్రాకు బీజేపీ మ‌ర‌ణ శాస‌నం !

ఆంధ్రాకు బీజేపీ మ‌ర‌ణ శాస‌నం !

బీజేపీకి ఏపీపై కోపం ఉంది అని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ... అంత‌కుమించి. నిన్న గ‌డ్క‌రీ మాట్లాడిన మాట‌లు చూస్తే ఆంధ్రాకు మ‌ర‌ణ శాస‌నం రాయ‌డానికి బీజేపీ ప‌క్కా ప్లాన్ వేసింది. ప‌రోక్షంగా చూస్తే ఆప‌రేష‌న్ గ‌రుడలో కేవ‌లం రాజ‌కీయాలే కాదు- ప్ర‌తిదీ భాగ‌మే అని అర్థ‌మ‌వుతోంది.

ప్ర‌స్తుతం దేశంలో మ‌హా జీవ న‌దులు మూడు .... బ్ర‌హ్మ‌పుత్ర‌, గంగ‌, గోదావ‌రి. మ‌హాన‌దులు రెండు... కృష్ణా, కావేరి. ఈ ఐదు న‌దులు దేశానికి జీవ‌నాధారం. అయితే, బ్ర‌హ్మ‌పుత్ర న‌ది నీటిని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు, మోడీ ప్ర‌భుత్వం రెండూ దారుణంగా విఫ‌లం అయ్యాయి. ఎందుకంటే ఆ న‌దిని దేశంలో ఇత‌ర న‌దుల‌తో అనుసంధానం చేస్తే దేశానికి ఎటువంటి క‌ర‌వు ఉండదు. ప్ర‌తి రోజు ప్ర‌తి నెలా నిరంత‌రం ఆ న‌దిలోంచి స‌ముద్రంలోకి నీరు పోతూనే ఉంటుంది. అంటే దేశానికి స‌రిప‌డా నీటి వ‌న‌రులు ఒక్క బ్ర‌హ్మ‌పుత్ర‌లోనే దొరుకుతాయి. కానీ కేంద్రంలోని ప్ర‌భుత్వాలు వాటిని నిర్ల‌క్ష్యం చేశాయి (దీనిపై గ‌తంలో కేసీఆర్ కొన్ని ర‌హ‌స్యాలు విప్పారు.. కింద లింకు ఇచ్చాం, చ‌ద‌వండి.).
Click Here

బాధ్య‌త క‌లిగిన నాయ‌కుడు, విజ‌న్ ఉన్న నాయ‌కుడు ఎవ‌రైనా ముందు అనుసంధానం నుంచి మొద‌లుపెడ‌తాడు. కానీ కేవ‌లం రాజ‌కీయాల కోస‌మే స‌ర్కారును వాడుకుంటున్న బీజేపీ దేశాన్ని త‌మ గుప్పిట్లో పెట్టుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన కార్య‌క్ర‌మాల కంటే బీజేపీకి అవ‌స‌ర‌మైన కార్య‌క్ర‌మాల కోసం ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంది.
 
గ‌డ్క‌రీ నిన్న హైదరాబాదుకు వ‌చ్చి ఏం మాట్లాడారంటే... *గోదావరి నుంచి ఏటా మూడు వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోంది. వాటి సద్వినియోగానికే గోదావ‌రిపై రెండు ప్రాజెక్టులు నిర్మిస్తాం. ఇంద్రావతి నుంచి భారీ ఎత్తున వస్తున్న నీటిని రెండు డ్యాములను నిర్మించడం ద్వారా కావేరీ బేసిన్‌కు తరలిస్తాం. ఈ ప్రాజెక్టుల‌ విలువ రూ.50 వేల కోట్లన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించే పోలవరం డ్యామ్‌ ద్వారా గోదావరి నీటిని కృష్ణా, పెన్నా బేసిన్‌కు తరలిస్తామని తెలిపారు. చివరకు అది కూడా కావేరీ నదిలో కలుస్తుందన్నారు*.

ఇది క‌చ్చితంగా ఏపీకి మ‌ర‌ణ శాస‌న‌మే. అది ఎలాగంటే... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ ప్రాజెక్టు క‌ట్టాల‌న్నా ఏవేవో అనుమ‌తులు రాలేద‌ని ప్రాజెక్టులు నిలిచిపోవ‌డం గాని, ఆల‌స్యం కావ‌డం గానీ జ‌రుగుతుంది. కానీ కర్ణాట‌క‌-మ‌హారాష్ట్రలో రెండేళ్ల‌కో ప్రాజెక్టు క‌ట్టేస్తున్నారు. మ‌రి వాళ్లు అనుమ‌తులు తీసుకుని క‌డుతున్నారో, తీసుకోకుండా క‌డుతున్నారో అర్థం కావ‌డం లేదు.
 
ఇప్ప‌టికే గోదావ‌రి నీటిని తెలుగు రాష్ట్రాల‌కు చేర‌కుండా లెక్క‌కు మించిన ప్రాజెక్టుల‌తో మ‌హారాష్ట్ర అడ్డుకుంది. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కూడా అంత‌కుమించి ప్రాజెక్టులు నిర్మించి తెలుగు రాష్ట్రాల‌కు నీళ్లు రాకుండా చేస్తున్నాయి. ఇపుడు కేవలం రెండు తెలుగు స్టేట్స్ వ‌రుణ‌ దేవుడు క‌రుణించిన‌పుడు లెక్క‌కు మించి వ‌చ్చే నీటితో మాత్ర‌మే ప్రాజెక్టులు నింపుకుంటున్నాయి. అంటే కేటాయింపులు అనేవి ఒక నిర్మాణాత్మ‌క అబ‌ద్ధం. నిజానికి ఎపుడైనా స‌రిగా వ‌ర్షాలు ప‌డ‌క‌పోతే అపుడు మాత్ర‌మే కేటాయింపులు జ‌రుగుతాయా లేదా అన్న విష‌యం తెలుస్తుంది. దీనికి ఉదాహ‌ర‌ణ ఏంటంటే... మొన్న క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడుకు నీళ్లు ఇవ్వ‌మ‌ని సుప్రీంకోర్టు ఆర్డరు వేస్తే రెండ్రోజుల క్రితం మేము ఇవ్వలేం అంటూ క‌ర్ణాట‌క స‌ర్కారు సుప్రీంకోర్టును దిక్క‌రించింది. ఇదీ ప్ర‌స్తుత ప‌రిస్థితి. ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించ‌డానికి మారు మాట్లాడ‌ని మోడీ ఆ రెండు రాష్ట్రాల‌ను ఏమీ చేయ‌లేక‌... ఏపీపై క‌న్నేశారు. ఏపీలో ఒడిసా, ఉత్త‌రాంధ్ర అడ‌వుల నుంచి వ‌చ్చే వ‌ర్ష‌పు నీటితో పారే ఇంద్రావ‌తి న‌ది మీద క‌న్నేశారు. ఆ నీటిని న‌మ్ముకునే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పోల‌వ‌రం నీటిని రాయ‌ల‌సీమ దాకా ఇస్తాన‌న్నారు.
 
ఇపుడు ఉత్త‌రాది పెద్ద న‌దుల‌ను ప‌ట్టించుకోని బీజేపీ ఏపీలో ఉప న‌దులను కూడా వ‌ద‌ల‌డం లేదు. పోల‌వ‌రంతో పాటు మ‌రో ప్రాజెక్టు క‌ట్టి ఏపీకి వ‌రుణుడి క‌రుణ‌తో ద‌క్కే ఆ నీటిని కూడా కావేరి బేసిన్‌కు త‌ర‌లిస్తుంద‌ట‌. అంటే త‌మిళ‌నాడులో అధికారాన్ని చేజిక్కించుకునే కొత్త గేమ్ ప్లాన్ ఇది. ఏతావ‌తా చూస్తుంటే... ఇక్క‌డ అర్థమ‌య్యేది ఒక‌టే. బీజేపీ దేశం మొత్తం త‌న చేతిలో పెట్టుకోవ‌డానికి ప్లాన్ వేసింది. అయితే, ఏ రాష్ట్రం బీజేపీ చేతికి చిక్కినా ఏపీ దొర‌క‌దు అన్న‌ది స్ప‌ష్ట‌మైంది. దీంతో ఓటు రాల‌ని ఆ ఏపీ ఏమైనా ప‌ర్లేదు.

ఇప్ప‌టికీ మీరు న‌మ్మ‌క‌పోతే ఈ ఒక్క ప్ర‌శ్న‌కు మీరు స‌మాధానం చెప్పండి- 40 వేల టీఎంసీలు స‌ముద్రంలో క‌లిసే బ్ర‌హ్మపుత్ర -గంగ న‌దుల అనుసంధానానికి 60 వేల కోట్లు వెచ్చిస్తే దేశ‌మే స‌స్య‌శ్యామ‌లం అయ్యే అవ‌కాశం ఉన్న‌పుడు కేవ‌లం మూడు వేల టీఎంసీల నీటి కోసం ఎందుకు బీజేపీ 50 వేల కోట్ల ప్లాను వేసింది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు