క‌ర్ణాట‌క‌లో బీజేపీ నేత‌ల‌కు `తెలుగు` సెగ‌!

క‌ర్ణాట‌క‌లో బీజేపీ నేత‌ల‌కు `తెలుగు` సెగ‌!

మ‌రో ఆరు రోజుల్లో క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గబోతోన్న నేప‌థ్యంలో క‌న్న‌డ ప్ర‌జ‌ల నాడి ప‌ట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌ధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీల మాట‌ల యుద్ధం అక్క‌డ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని ఒక్క‌సారిగా వేడెక్కించింది. దాదాపు కోటి మంది తెలుగు ఓట‌ర్లు ....రాబోయే ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌లిగే అవ‌కాశ‌మున్న నేప‌థ్యంలో వారిపై బీజేపీ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది.

అయితే, ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ మోసం చేసింద‌ని....ఆ పార్టీకి తెలుగు ప్ర‌జ‌లు ఓటు వేయొద్ద‌ని టీడీపీతో స‌హా ప‌లు పార్టీలు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే అక్క‌డి బీజేపీ నేత‌ల‌కు తెలుగు ప్ర‌జ‌ల సెగ త‌గులుతోంది. కొప్పాల‌, బ‌ళ్లారి, రాయ్ చూర్, క‌ల‌బురిగి వంటి ప్రాంతాల‌లో బీజేపీ నేత‌ల‌పై తెలుగు ఓట‌ర్లు వ్య‌తిరేక‌త‌ను చూపుతున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను బీజేపీ వెన్నుపోటు పొడిచింద‌ని క‌ర్ణాట‌క‌లోని తెలుగు ప్ర‌జ‌ల‌తో పాటు అక్క‌డి క‌న్న‌డిగులు బ‌లంగా న‌మ్ముతున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాబోయే ఎన్నిక‌ల్లో ఎలాగైనా బీజేపీని ఓడించాల‌ని కృత నిశ్చ‌యంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే అక్క‌డ బీజేపీకి మ‌ద్ద‌తిచ్చే స్థానిక నేత‌ల‌కు తెలుగు ప్ర‌జ‌లు, క‌న్న‌డిగుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది. ఓ వివాహ వేడుక‌లో హాజ‌రైన బీజేపీ నేత బ‌లరాం, ఆయన కుమారుడిని వారి బంధువులు నిల‌దీశారు. ఇంకా, బీజేపీకి మ‌ద్ద‌తు ఎందుకు తెలుపుతున్నార‌ని ప్ర‌శ్నించారు. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో కూడా బీజేపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని బెంగ‌ళూరు తెలుగు అసోసియేష‌న్ వైస్ ప్రెసిడెంట్ మ‌ధుసూద‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఐటీ ఉద్యోగుల నుంచి రైతుల వ‌ర‌కూ...తెలుగువారంత మోదీని, బీజేపీని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నార‌న్నారు. త‌మ అభిప్రాయాలు వేరైన‌ప్ప‌టికీ....హోదా విష‌యంలో ఏపీని మోసం చేసిన బీజేపీకి త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని భావిస్తున్నారని చెప్పారు. ఈ వ్య‌తిరేక ప‌వ‌నాల మ‌ధ్య క‌ర్ణాట‌క‌లో బీజేపీ అధికారం ద‌క్కించుకుంటుందా లేదా అన్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడక త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు