కమల కాంతులు కనిపించవేం?

కమల కాంతులు కనిపించవేం?

దేశంలో కాంగ్రెసు పార్టీ వెలుగులు తగ్గుతున్నాయని కొన్ని సర్వేలు వెల్లడించగా, కాంగ్రెసు పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా గొప్పగా పుంజుకోలేకపోతున్నది. గుజరాత్‌లో బిజెపి నెగ్గడంతో, అక్కడి ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ప్రధాని అవుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కాని కర్నాటక ఎన్నికలతో బిజెపి కాంతి విహీనమైపోయిందని చెప్పుకోవాల్సి వస్తున్నది.

మన రాష్ట్రంలోనూ బిజెపికి గొప్పగా పరిస్థితులు అనుకూలించడంలేదు. తెలంగాణ ప్రాంతంలో బిజెపి కొంత పుంజుకోవచ్చునేమోగాని రెండు మూడు ఎంపి సీట్లు గెలిచే పరిస్థితులూ ఆ పార్టీకి లేవని సర్వేలు స్పష్టం చేసేశాయి. ఏదేమైనప్పటికీ కాంగ్రెసు, బిజెపి రేసులో వెనకబడుతున్నట్లుగానే కనిపిస్తున్నది. తృతీయ కూటమి ఆశలు చిగురిస్తున్నప్పటికీ ఆవిరైపోయే అవకాశాలే ఎక్కువ. ప్రత్యామ్నాయం ప్రజలకు కనిపించడంలేదంటే అది ప్రజల దౌర్భాగ్యమేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు