బట్టలిప్పి మాట్లాడుకోవడం అయిపోయిందా పవన్?

బట్టలిప్పి మాట్లాడుకోవడం అయిపోయిందా పవన్?

శ్రీరెడ్డి ఎపిసోడ్ లో.. తనపై కొన్ని ఛానళ్లు ప్రవర్తించిన తీరుపై విపరీతంగా రియాక్ట్ అయ్యాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వరుసగా కొన్ని రోజుల పాటు.. ఉదయం రాత్రి అనే తేడా లేకుండా పవర్ ఫుల్ ట్వీట్స్ వేస్తూనే ఉన్నాడు. మొదట్లో పవర్ అనిపించినా.. ఇవన్నీ పాత వీడియోలే కావడం.. విమర్శలలో పదును తగ్గడంతో జనాలు కూడా కొంచెం కాన్సంట్రేషన్ తగ్గించారు.

మరోవైపు పవన్ కూడా ఈ విషయంలో ఎవరినీ డైరెక్టుగా బ్లేమ్ చేయడం లేదు. ఒక సమయంలో బట్టలు విప్పి మట్లాడుకుందాం.. అంటూ స్ట్రాంగ్ వర్డ్స్ నే ఉపయోగించిన పవన్.. ఇప్పుడు మళ్లీ సాత్వికుడి రూపంలోకి వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. కొన్ని రోజులుగా తను చదివిన పుస్తకాలు.. వాటిలోంచి మంచి కొటేషన్స్ ను మాత్రమే ట్వీట్ చేస్తున్నాడు. ఇవి కూడా తన వ్యక్తిత్వాన్ని ఘనంగా చెబుతూ.. తల్లితో సహా తనను కించపరిచిన వారికి కౌంటర్లే. కానీ పవన్ చెప్పినట్లుగా బట్టలు విప్పి మాట్లాడుకుందాం అనే రేంజ్ లో అయితే లేవు. ఇదంతా చూసి పవన్ కళ్యాణ్ డోస్ తగ్గించేశాడా.. లేకపోతే ఈ గొడవ వదిలేశాడా అనుకోవచ్చు.

కానీ జేఎస్పీ శతఘ్ని టీం అంటూ జనసేనకు సపోర్టింగ్ గా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. వీటిలో మీడియాపై పంచ్ లే ఎక్కువగా ఉంటున్నాయి. టాప్ ఛానల్స్ అన్నీ గతంలో సినిమా జనాలను ఎలా కించపరిచారనే వీడియోలతో పాటు.. పలువురు ఫిలిం పర్సనాలిటీలు తమ గురించి ఆలోచించమని అడగడాలు ఉంటున్నాయి. అంటే.. ఓరకంగా బట్టలు విప్పి మాట్లాడుకోవడం అనే పాయింట్ ను తను కాకుండా.. ఈ శతఘ్ని టీంకు పవన్ అప్పగించాడేమో అనుకుంటున్నారు జనాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు