ఆర్థిక ఉగ్రవాది అనొచ్చా?

ఆర్థిక ఉగ్రవాది అనొచ్చా?

సీనియర్‌ మంత్రి అయిన ఆనం రాంనారాయణరెడ్డి, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని విమర్శించడానికి ఉరకలేసే ఉత్సాహం ప్రదర్శిస్తుండడం ఆశ్చర్యంగా ఉంది. జగన్‌ ప్రజలను దోచుకున్నారని, ఆయన ఉరిశికక్షూ అర్హుడేనని ఆనం రాంనారాయణరెడ్డి అనడం వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ వారిని ఆందోళనకు గురిచేసింది.

జగన్‌ ఆస్తుల కేసు విచారణలో ఉండగా ఓ మంత్రి న్యాయస్థానాలను ప్రభావితం చేసేలా మాట్లాడడమేంటని వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు కూడాను. ఇప్పుడు తీవ్రత కొంచెం పెంచి, జగన్‌ను ఆర్థిక ఉగ్రవాది అని విమర్శించారు ఆనం రాంనారాయణరెడ్డి. సీనియర్‌ మంత్రిగా ఆయన ఇలా అనడం మంచిది కాదు.

సిద్ధాంత పరంగా విమర్శలు చేయడం వరకు తప్పులేదుగాని తీవ్రమైన దూషణలకు దిగడం రాజకీయాల్లో ఎవరికీ పద్ధతి కాదనే విషయం రాజకీయ ప్రముఖులు తెలుసుకుంటే మంచిది. జగన్‌ అంత తీవ్రమైన నేరాలు చేసుంటే కాంగ్రెసు పార్టీలో ఆయన ఉన్నప్పుడు ఎందుకు ఈ ఆరోపణలు రాలేదన్న ప్రశ్న తలెత్తుతుంది. దీనికి కాంగ్రెసు పార్టీ వద్ద సమాధానం దొరకదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు