పవన్ కి సపోర్ట్.. ప్రాబ్లెమ్ లేదా? రాదా?

పవన్ కి సపోర్ట్.. ప్రాబ్లెమ్ లేదా? రాదా?

పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీడియాపై నేరుగా వార్ ప్రకటించేశాడు. ఓ వైపు సంధి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఓ ఛానల్ అధినేత గట్టిగానే ట్రై చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు చిరంజీవి.. బాలకృష్ణ సహా మొత్తం టాలీవుడ్ లో టాప్20 హీరోలు అంతా మీటింగ్ పెట్టుకుని మరీ.. ఈ విషయాన్ని ఓ కొలిక్కి తేవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు మాత్రం.. పవన్ కళ్యాణ్ తన యుద్ధాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. తనకు వచ్చిన నోటీసులకు ఘాటు సమాధానాలు ఇవ్వడం మాత్రమే కాదు.. తాను కూడా లీగల్ నోటీసులు పంపుతున్నట్లు చెబుతున్నాడు. ఇదంతా ఒక ఎత్తైతే.. ఇప్పుడిప్పుడే మంచు మనోజ్ లాంటి హీరోలు.. పవన్ చేస్తున్న ఆరోపణలు వాస్తవం అనే విధంగా మాట్లాడుతున్నారు. పవన్ మాటల వెనుక నిజానిజాల సంగతి తేలకుండానే.. పవర్ స్టార్ కు అభిమానులు వంత పాడడం సహజమే. ఇందులో జబర్దస్త్ బ్యాచ్ కూడా ఉంటున్నారు. హైపర్ ఆది.. సుడిగాలి సుధీర్.. షకలక శంకర్ వంటి జబర్దస్త్ ఆర్టిస్టులు అంతా.. టీవీ9.. టీవీ5.. ఏబీఎన్ ఛానల్స్ మీద ఓపెన్ గానే విమర్శలు చేస్తున్నారు.

కెరీర్ ఇప్పుడే కీలక దశకు చేరిన స్థితిలో.. ఇలా మీడియాపై విమర్శలకు దిగడం వారికి కరెక్ట్ కాదనే సూచలను వినిపిస్తోంది. కానీ వారు ఇలాంటివేమీ పట్టించుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. నిజానికి మీడియా సపోర్ట్ కంటే.. వీరి కెరీర్ కి మెగా ఫ్యామిలీ అండదండలే ఎక్కువగా లాభిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. జబర్దస్త్ లో ఎలాగూ నాగబాబు ఉంటారు.. మెగాహీరోల సినిమాల్లో వీరిలో ఒకరిద్దరికి అవకాశాలు అందుతూనే ఉన్నాయి.

ఇప్పటికే షకలక శంకర్ అయితే కేవలం పవన్ పేరు చెప్పే స్టార్ కమెడియన్ స్టేటస్ కి దగ్గరగా వెళ్లిపోయాడు. రంగస్థలంలో మహేష్ కి దక్కిన రోల్.. చిరకాలం గుర్తుండిపోయేదే. ఇలాంటి పరిస్థితిలో సైలెంట్ గా ఉండడం కంటే.. పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ పలకడమే తమకు లాభించే విషయంలో జబర్దస్త్ బ్యాచ్ భావిస్తూ ఉండొచ్చని టాక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English