పోర్న్‌ చూడ‌టం వ‌ల్లే..దేశంలో రేప్‌లు

పోర్న్‌ చూడ‌టం వ‌ల్లే..దేశంలో రేప్‌లు

దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇండోర్‌లో 6 నెలల పసికందును అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఈ అఘాయిత్యానికి పాల్పడింది శిశువు సమీప బంధువు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని కటక్ జిల్లాలో మరో చిన్నారిపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత చిన్నారి మృతదేహాన్ని స్థానిక పాఠశాలలో పడేసి వెళ్లిపోయారు. ఉన్నావ్, కతువా, సూరత్ అత్యాచార ఘటనలు మరువకముందే ఇలాంటి ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించేలా ఆర్డినెన్స్ తీసుకువచ్చిన విషయం విదితమే. ఇలా క‌ల‌క‌లం జ‌రుగుతున్న స‌మ‌యంలో...బీజేపీ నాయ‌కుడు, మంత్రి దేశంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలకు పోర్న్ సైట్సే కారణమ‌ని తేల్చారు.

మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి భూపేంద్ర సింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ  పోర్న్ సైట్స్ చూసి అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు తేలింద‌న్నారు. త‌మ‌ రాష్ట్ర హోంశాఖ చేసిన సర్వేలో వెల్లడైందని ఆయన పేర్కొన్నారు. పోర్న్ సైట్స్‌ను నిషేధించాలని కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాశామని తెలిపారు. త‌ద్వారా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌న్నారు. కాగా,  కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ సైతం ఇదే రీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. `ఇంత పెద్ద దేశంలో లైంగిక దాడులు మామూలే. ఏదో ఒక మూల ఒకటో, రెండో ఘటనలకు విపరీత ప్రచారంతో రాద్ధాంతం అవసరం లేదనుకుంటా. వాటి నిలుపుదలకు ప్రభుత్వం కృషిచేస్తున్నా జరుగుతుండటం దురదృష్టకరం` అని అన్నారు. అవసర వ్యాఖ్యలు చేసి మీడియాకు మసాలా అందించొద్దని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలను ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించిన రోజే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు