పాచిపోయిన క్లిప్పుల‌తో ప‌వ‌న్‌కు డ్యామేజ్‌

పాచిపోయిన క్లిప్పుల‌తో ప‌వ‌న్‌కు డ్యామేజ్‌

స‌హ‌నాన్ని ఆయుధంగా చేసుకున్నోడికి స‌మ‌స్య‌లు రావొచ్చు. కానీ.. అవ‌న్నీ తాత్కాలికం. స‌హ‌నంతో ఉన్నోడు త‌ప్పులు చేయ‌డు. అన‌వ‌స‌రమైన ఉద్వేగాల‌కు గురి కాదు. ఆచితూచి అడుగు వేస్తాడు. కానీ.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించే వారు త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తుంటారు. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌వ‌హారం ఇదే రీతిలో ఉంది.

త‌న‌పై ట్వీట్ల మీద ట్వీట్లు చేసి.. త‌న‌ను రియాక్ట్ కావాలంటూ కోరే వారి విష‌యాన్ని ప‌ట్టించుకోన‌ట్లుగా ఉండే ప‌వ‌న్‌.. శ్రీ‌రెడ్డి విష‌యంలో ఒక ఛాన‌ల్ వారు అడిగిన ప్ర‌శ్న‌కు స్పందించి.. పోలీస్ స్టేష‌న్ కు వెళ్లాల‌న్న సూచ‌న చేశారు.

ఆ స‌ల‌హాను వంక పెట్ట‌టానికి వీల్లేకున్నా.. దాన్ని ప‌ట్టుకొని పీకి లాగిన శ్రీ‌రెడ్డి.. ఆ త‌ర్వాతేం చేశారో తెలిసిందే.

ప‌వ‌న్ స‌ల‌హాను త‌న‌దైన రీతిలో ట‌చ్ ఇచ్చిన వ‌ర్మ.. శ్రీ‌రెడ్డికి స‌ల‌హా ఇచ్చి టీవీ ఛాన‌ళ్ల మైకుల ముందు చెల‌రేగిపోవాల‌న్నారు. శ్రీ‌రెడ్డి అదే ప‌ని చేయ‌టం.. దీనిపై ప‌వ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే.

ఇప్ప‌టివ‌ర‌కూ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అన్న‌ట్లు ఉన్న ప‌వ‌న్ అందుకు భిన్నంగా ఇప్పుడు ఆవేశంతో చెల‌రేగిపోతున్నారు. మీడియా సంస్థ‌లు కొన్నింటి మీద ఆయ‌న మండిప‌డుతున్నారు. ఇందులో భాగంగా అప్పుడెప్పుడో అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డుల మాదిరి.. పాచిపోయిన పులుసు లాంటి వీడియో క్లిప్పుల‌తో మీడియా అధినేత‌ల మీద వార్ షురూ చేశారు. టీవీ9.. ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి అధినేత‌ల‌పై ట్వీట్ వ్యాఖ్య‌లు చేస్తున్న ప‌వ‌న్‌.. టీవీ9 సీఈవో ర‌విప్ర‌కాశ్‌కు చెందిన పాత వీడియో క్లిప్ (అందులో ఒక వ్య‌క్తి ర‌విప్ర‌కాశ్ కాళ్లు ప‌ట్టుకోవ‌టం ఉంటుంది).. మ‌రో ఫోటో ఇమేజ్ లో ర‌విప్ర‌కాశ్ ను టీవీ9 పూర్వ ఉద్యోగి చెప్పుతో కొట్టిన‌ట్లుగా ఉంటుంది.

త‌న త‌ల్లిని అన‌వ‌స‌రంగా తిట్టారంటూ ప‌వ‌న్ ఆవేద‌న విష‌యంలో ఆయ‌న వెంట ఉన్న వారు సైతం.. ప‌వ‌న్ తాజాగా చేస్తున్న ట్వీట్ల విధానాన్ని స‌మ‌ర్థించ‌టం లేదు. నిజంగానే ఎవ‌రైనా మీడియా అధినేత‌ల‌కు సంబంధించిన త‌ప్పుడు ప‌త్రాలు.. త‌ప్పుడు ప‌నుల‌కు సంబంధించిన సాక్ష్యాలు ఉంటే వాటిని బ‌య‌ట‌పెడితే ఫ‌ర్లేదు కానీ.. అప్పుడెప్పుడో వైర‌ల్ అయి.. వాటి మీద వివ‌ర‌ణ‌లు కూడా వ‌చ్చేసిన వాటిని పోస్ట్ చేయ‌టం స‌రికాదంటున్నారు. నీతులు చెప్పే ప‌వ‌న్‌.. తాను చెప్పిన నీతుల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం స‌రికాద‌ని.. ఇలానే చేస్తూ పోతే ప‌వ‌న్ కున్న ఇమేజ్ కూడా డ్యామేజ్ కావటం ఖాయ‌మంటున్నారు. సో.. థింక్ ప‌వ‌న్‌.. థింక్‌!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు