ప‌వ‌న్‌: ఉద‌యం ఆవేశం.. సాయంత్రం బేల‌త‌నం!

ప‌వ‌న్‌: ఉద‌యం ఆవేశం.. సాయంత్రం బేల‌త‌నం!

పొద్దున్నే ఆంధ్ర‌జ్యోతి లో కొత్త‌ప‌లుకు శీర్షిక‌న పాపం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ వేమూరి రాధాకృష్ణ‌* ఓ పెద్ద వ్యాస‌మే రాశారు. మ‌రి ప‌వ‌న్ అది చూశారో, లేదో తెలియ‌దు గాని ఆర్కేకు పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ వెంట‌నే ఒక పోస్టుచేశారు. బ‌ట్ట‌లూడ‌దీసి మాట్లాడుకుందాం... బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌దాం అని #బీఎంబీకే అనే కొత్త హాష్ ట్యాగ్ కూడా పెట్టారు. ఈరోజు మ‌న గెస్ట్ ఆర్కే అని చెప్పారు. ఆ త‌ర్వాత కొద్ది గంట‌ల‌కి దానిని ప‌క్క‌న పెట్టి అరె ఓ సాంబ హ‌కుం స‌ర్దార్  ప్రోగ్రాం మీ ముందుకు రాబోతుంది అన్నారు. త్వ‌ర‌లోనే స‌ర‌దాగా కాల‌క్షేపం కోసం దీన్ని తెస్తున్నాం అన్నారు. ఇందులో భాగంగా సింపుల్ చిట్‌చాట్‌, గాసిప్‌,  ఫొటోస్, వీడియోలు మీ మందుకు తెస్తాం అన్నారు. కొన్ని అక్ర‌మ అశ్లీల‌ వ్య‌వ‌హారాలు కూడా రాబోతున్నాయి అని చెప్పారు. దీంతో ఏం చేయ‌బోతున్నాడో ప‌వ‌న్ అని కొంద‌రు షాక్ తిన్నారు కూడా. కానీ కొన్ని గంట‌ల‌కే ఆయ‌న తీరుమారింది. మ‌రి పొద్దున ఆర్కే సంధించిన ప్ర‌శ్న‌లు ముందుగా తెలుసుకుంటే... సాయంత్రానికి ప‌వ‌న్ రెస్పాన్స్ ఎందుకు మారిందో మ‌న‌కేమైనా అర్థ‌మ‌వుతుందేమో ఆలోచిద్దాం.

ఉదయం ఆర్కే కొత్త‌ప‌లుకులో వ్య‌క్తం చేసిన అనుమ‌నాలు...

1. మొన్నటివరకు పవన్‌ కల్యాణ్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు శ్రీమతి రోజా నిన్నటి నుంచి మా పవన్‌ కల్యాణ్‌ అని సంబోధించడం వెనుక మతలబు ఏమిటి?

2. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు. తీవ్ర వత్తిడి తెచ్చి ఆయన కేంద్రాన్ని విమర్శించకుండా నిలువరించింది ఎవరు?

3. గవర్నర్‌ నరసింహన్‌– పవన్‌ కల్యాణ్‌ మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? వారి మధ్య అనుబంధం ఏర్పడటం వెనుక కేంద్రంలోని పెద్దల పాత్ర ఏమిటి?

4. ఒకప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబాన్ని విమర్శించిన పవన్‌ కల్యాణ్‌ హఠాత్తుగా కేసీఆర్‌ను కలిసి పొగడ్తలతో ముంచెత్తడం వెనుక ఏమి జరిగింది?

5. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిలదీస్తున్న మీడియా సంస్థలనే పవన్‌ కల్యాణ్‌ టార్గెట్‌ చేసుకోవడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి?

6. శ్రీరెడ్డి తిట్టిన తిట్టును ఒక్కసారి కూడా ఏబీఎన్ ప్రసారం చేయలేదు. అయినా, తన తల్లిని కించపరిచే తిట్టును పదేపదే ప్రసారం చేయడం ఏమిటని పవన్‌ కల్యాణ్‌ నిందించడంలోని
ఆంతర్యం ఏమిటి?

7. పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఎవరితో యుద్ధం చేయబోతున్నారో తెలియాలి?

8. సమస్యలు ఉంటే పోలీసు స్టేషన్‌నో, న్యాయస్థానాన్నో ఆశ్రయించాలని శ్రీరెడ్డికి సూచించిన ఆయన ఇప్పుడు చేసింది ఏమిటి?

అయితే... పొద్దున భారీ వార్ ప్ర‌ర‌క‌టించిన‌ట్టున్న ప‌వ‌న్ ట్వీట్స్ సాయంత్రానికి ట‌ర్న్ తీసుకుని బేల‌త‌నాన్ని బ‌య‌ట‌పెట్టాయి. మేము బ‌లహీనులం. మీకు ప‌వ‌ర్ ఉంది. మీరు చేసేవ‌న్నీ మేము భ‌రిస్తాం. అంత‌కుమించి ఏం చేస్తాం? అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ పై పెట్టిన కేసుల వివ‌రాల‌ను పోస్టు చేశారు. దానికి భిన్నంగా మ‌రో ట్వీటు పెడుతూ టీడీపీ జ్యోతిర‌త్న ఆర్కే టీడీపీ క‌ల్చ‌ర్ ఏంటి? అందరినీ నోటికొచ్చిన‌ట్టు తిట్ట‌డ‌మా? ప‌్ర‌ధాన‌మంత్ర‌యినా, సామాన్యుడ‌యినా మీ తిట్లు  తినాల్సిందేనా? ఉత్త‌మ శిక్ష‌ణ‌. కీపిట‌ప్‌! అంటూ ట్వీట్ చేశారు.

కానీ టీడీపీకి వేయాల్సిన ప్ర‌శ్న‌ను రాధాకృష్ణ‌కు వేయ‌డం ఇక్క‌డ విచిత్రం అయితే ఉద‌యానికి-సాయంత్రానికి ఆవేశానికి-ఆవేద‌న‌కు ఉన్నంత తేడా చూపించ‌డం ఏంట‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. ఇది ఆయ‌న అజ్ఞాత‌వాసి సినిమాలో పాట‌లాగా ట్వీట్లుగా గాలివాలుగా అనిపిస్తున్నాయని సోష‌ల్ మీడియాలో సెటైర్లు ప‌డుతున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు