ఆ నటుడు షేర్ చేశాడు.. బుక్కయ్యాడు

ఆ నటుడు షేర్ చేశాడు.. బుక్కయ్యాడు

సోషల్ మీడియా అనేది ఎంత డేంజరసో చెప్పడానికి ఈ ఉదంతం రుజువు. ఎవరో ఏదో పోస్ట్ పెడతారు. దాన్ని మనం షేర్ చేస్తాం. ఆ పోస్టు వివాదాస్పదం అవుతుంది. ఆ పోస్ట్ నాది కాదు.. జస్ట్ షేర్ చేశానంతే అంటే కుదరదు. ఆ పోస్టుకు బాధ్యత వహించాల్సిందే. తమిళ సీనియర్ నటుడు.. రచయిత ఎస్వీఈ శేఖర్ ఇలాగే బుక్కయ్యాడు. ఐతే ఈ వ్యవహారంలో ఆయన అమాయకుడిగా ఏమీ కనిపించడం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే..

కొన్ని రోజుల కిందట తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్.. ఒక ప్రెస్ మీట్ అనంతరం మహిళా విలేకరి బుగ్గ నిమిరాడు. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను కూడా జర్నలిజం నుంచే వచ్చానని.. మంచి ప్రశ్న అడగడంతో తన మనవరాలి వయసున్న ఆ అమ్మాయి బుగ్గ సరదాగా నిమిరానని ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. క్షమాపణ కూడా చెప్పాడు. కానీ ఆమె కన్విన్స్ అవ్వలేదు.

ఇదిలా ఉంటే భన్వరిలాల్ ఎన్డీఏ సర్కారు నియమించినవాడు కావడంతో భాజపాను డీగ్రేడ్ చేయడానికే ఆ విలేకరి అలా చేసిందన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో మహిళా విలేకరులు.. తమ బాస్‌లతో పడుకోవడం ద్వారానే ఉద్యోగాలు సంపాదిస్తారంటూ పేర్కొన్న ఒక అధ్యయనాన్ని కోట్ చేస్తూ ఫేస్ బుక్‌లో ఎవరో ఒక పోస్ట్ పెడితే.. దాన్ని తమిళనాడు బీజేపీ నాయకుడైన శేఖర్ షేర్ చేశాడు. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సినీ ప్రముఖులే కాక అందరూ ఆయన తీరును తప్పుబట్టారు. కేసులు పెట్టే పరిస్థితి కూడా వచ్చింది. తాను కంటెంట్ చూడకుండానే ఆ పోస్టును షేర్ చేశానని.. తర్వాత డెలీట్ చేయడానికి వీల్లేకుండా ఫేస్ బుక్ సెట్టింగ్స్ ఉన్నాయని శేఖర్ వివరణ ఇచ్చుకున్నా ఫలితం లేకపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు