తాళి.. ఎగతాళి

తాళి.. ఎగతాళి

తాళి.. మంగళసూత్రం.. పేరేదైనా ఇది హిందూ మతంలో వైవాహిక జీవితానికి ప్రతీక. తాళిని వివాహితులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. తాళి అంటే భర్త ప్రాణం. దాన్ని దైవంగా వివాహితులు భావించడం అనాదిగా వస్తున్నది. కాని ఇది హిందూ సంప్రదాయం కాదని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌ చెప్పడం విడ్డూరంగా ఉంది.

ఓ పెళ్ళికి హాజరైన కెసిఆర్‌, నూతన వధూవరులను ఆశీర్వదించి ఊరుకుంటే బాగుండేది. కాని ఆయన తాళిని ఎగతాళి చేసేలా మాట్లాడారు. అది హిందూ సంప్రదాయం కానే కాదని చెప్పారు. కెసిఆర్‌ చెప్పినంతమాత్రాన తాళి అనేది హిందూ సంప్రదాయంలో భాగం కాకుండా పోదు. దేశంలో ఏ మూల ఎక్కడ ఏ హిందూ మతస్తుల పెళ్ళికి వెళ్ళినా తాళి ప్రాముఖ్యత కెసిఆర్‌కి తెలుస్తుంది. కోరి వివాదాలను తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆయన అలా అన్నారేమో.

 

TAGS

KCR Telangana

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు