ఫ‌ర్లేదు.. మోడీని లోకేష్ ఆడుకుంటున్నాడే!

ఫ‌ర్లేదు.. మోడీని లోకేష్ ఆడుకుంటున్నాడే!

టెక్నాల‌జీ వాడ‌టంలో లోకేష్ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు. హోదా విష‌యంలో బ‌ట్ట కాల్చి ఏపీ మీదేసి త‌ప్పించుకు తిరుగుతున్న మోడీని అవ‌కాశం వ‌స్తే చాలు ఆడుకుంటున్న చిన‌బాబు ఈరోజు అవ‌కాశం దొరికించుకుని మ‌రీ ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా హోదా విష‌యంలో ప్ర‌ధాని మోడీని బాగా టార్గెట్ చేశారు లోకేశ్‌.

ప్ర‌ధాని మోడీ చేసిన ట్వీట్ కు చిన‌బాబు రీట్వీట్ చేసిన వైనం.. అందుకు ఎంచుకున్న పంచ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇటీవ‌ల జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న ప‌రిణామాలు మోడీ టీంను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌న మీదా.. త‌న ప్ర‌భుత్వం మీద వ‌స్తున్న‌ ఆరోప‌ణ‌లపై ప్ర‌ధాని మోడీ ట్వీట్ చేశారు. మోడీ ట్వీట్ ఇలా ఉంది..  *స‌రైన ప‌రిశోధ‌న‌.. ఆధారాలు లేకుండా త‌న‌పై అస‌త్య ఆరోప‌ణ చేయ‌టం బాధాక‌రం* అంటూ మోడీ ట్వీట్ చేశారు. ఇందులో టాపిక్ మెన్ష‌న్ చేయ‌క‌పోవ‌డంతో ఛాన్స్ తీసుకున్న లోకేష్ మంచి కౌంట‌ర్ ఇచ్చారు.

చ‌ట్టంలో పొందుప‌ర్చిన విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు హోదాతో పాటు ఇచ్చిన 18 హామీల‌ను నెర‌వేర్చాల‌ని ప్ర‌శ్నించినందుకు ఎలాంటి ఆధారాలు లేకుండా బీజేపీ నేత‌లు త‌మ‌పై బుర‌ద జ‌ల్లుతున్నార‌ని ట్వీట్ చేశారు. అంతేనా.. ఇంకా అనేక ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని.. ఇదెంత‌వ‌ర‌కు స‌బ‌బు? అంటూ లోకేష్‌ ఇచ్చిన కౌంట‌ర్ చూసిన‌ప్పుడు చిన‌బాబు దెబ్బ అదిరింది అని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English