బాబు దీక్ష‌కు సినీ మ‌ద్ద‌తు

బాబు దీక్ష‌కు సినీ మ‌ద్ద‌తు

రాజ‌కీయం వేరు. రాష్ట్రం వేరు. ఈ రెండింటినీ చంద్ర‌బాబు హంస‌లాగా వేరు చేస్తుంటారు. అందుకే బంద్ ల‌కు చాలావ‌ర‌కు చంద్ర‌బాబు వ్య‌తిరేకం. దీనివల్ల కొన్ని నింద‌లు కూడా ప‌డుతున్నా ఆయ‌న మార‌డం లేదు. ఏదైనా ఫ‌ల‌వంత‌మ‌య్యే నిర‌స‌న‌ల ద్వారా సాధించాల‌ని, ప్ర‌పంచం మ‌న వైపు చూస్తే అవ‌స‌ర‌మైన‌వి నెర‌వేరుతాయ‌న్న‌ది బాబు సిద్ధాంతం. అందుకే విధ్వంసాల‌కంటే దీక్ష‌ల వైపు మొగ్గుచూపుతారు. తాజాగా ధ‌ర్మ పోరాట దీక్ష పేరిట ఏపీకి జ‌రిగిన అన్యాయంపై ఒక రోజు, అది కూడా త‌న పుట్టిన రోజు నిరాహార దీక్ష చేయాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. దీనికి అంద‌రి నుంచి భారీ మ‌ద్ద‌తు ద‌క్కుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌ర‌ఫున చేస్తున్న పోరాటానికి అన్నివైపుల నుంచి మ‌ద్ద‌తు వ‌స్తుంది.

దీనిపై ఈరోజు స్పందించిన నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ చంద్ర‌బాబు దీక్ష‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ప్రత్యేక హోదా కోసం ఏపీలోని అన్ని పార్టీలు కలిసి పోరాడాలని ఆయ‌న ఆకాంక్షించారు. కేంద్రం మోసం చేసిన మాట నిజ‌మే, హోదా ఇస్తామంటూ తొలుత హామీ ఇచ్చి తర్వాత ఎందుకు వెనకడుగు వేసిందో అర్థం కావడం లేదని చెప్పారు. పైగా చాలా విచిత్రంగా 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు ఒప్పుకోవడం లేదంటూ తప్పుడు సమాచారం చాలా ప‌బ్లిక్‌గా నేష‌న‌ల్ మీడియాలో కూడా ప్ర‌చారం జ‌ర‌గ‌డం ఏపీని ఏ స్థాయిలో మోసం చేశారో చెప్ప‌డానికి ఉదాహ‌ర‌ణ అన్నారు. ప్రత్యేక హోదాకు తాము అడ్డంకి కాదని సాక్షాత్తు ఆర్థిక సంఘం ఛైర్మన్ చెప్పారని గుర్తు చేసిన భ‌ర‌ద్వాజ కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చంద్రబాబు రేపు చేపడుతున్న నిరాహారదీక్షకు సినీ పరిశ్రము మద్దతుగా నిలుస్తుందని ప్ర‌క‌టించారు.

 ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని క‌ల‌సి పోరాడితే విజ‌యం త‌ప్ప‌క వస్తుంద‌ని ఆయ‌న‌ అన్నారు. ఇంకో ఐదారేళ్ల‌లో తెలుగు సినిమా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా విస్త‌రిస్తుంద‌ని త‌మ్మారెడ్డి అంచ‌నా వేశారు. అమ‌రావ‌తి నుంచి సినిమా ప‌రిశ్ర‌మ‌కు పిలుపుంకా రాలేద‌న్నారు. అయితే, మాకేమీ రాయితీలు అవ‌స‌రం లేదు గాని, చ‌క్క‌టి స‌హ‌కారం ఉంటే చాల‌ని త‌మ్మారెడ్డి వ్యాఖ్యానించ‌డం కొస‌మెరుపు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English