నోట్ల క‌ష్టాలుః హైద‌రాబాద్‌కు విమానంలో న‌గ‌దు

నోట్ల క‌ష్టాలుః హైద‌రాబాద్‌కు విమానంలో న‌గ‌దు

దేశ వ్యాప్తంగా తీవ్ర నోట్ల కొరతను ఎదుర్కొంటున్న సంగ‌తి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దేశంలోని 12 రాష్ట్రాలు అత్యధిక నగదు కొరతను ఎదుర్కొంటున్నామ‌ని వెల్ల‌డించాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, కర్నాటక, బీహార్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. అదే విధంగా తాము కూడా నగదు కొరత ఎదుర్కొంటున్నట్లు చత్తీస్‌ఘడ్‌ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా జమ్మూ కాశ్మీర్‌, మహారాష్ట్ర రాష్ట్రాలు తమకు నగదు లేదని ప్రకటించాయి. వచ్చే 5 నుంచి ఏడు రోజుల్లో నగదు కొరతను పరిష్కరిస్తామని ఆర్ధిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఈ క్ర‌మంలో తెలంగాణ ప్ర‌భుత్వం చేసిన ఒత్తిడి ఫ‌లితంగా కీల‌క నిర్ణ‌యం వెలువ‌డింది. నోట్ల కొరత తీవ్రంగా ఉన్నందున హైదరాబాద్‌కు విమనాల నుంచి నగదు తరలించాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నిర్ణయించింది.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున డ‌బ్బుల కొర‌త ఎదురవుతున్న నేప‌థ్యంలో...ప్ర‌భుత్వం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను వివ‌ర‌ణ కోరింది. నగదు కొరత సమస్యను పరిష్కరించేందుకు తాము తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వానికి క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ వివరించింది. ఈ కమిటీకి ఎస్‌బీఐ నాయకత్వం వహిస్తోంది. నోట్ల కొరత సమస్యను అధిగమించేందుకు కోచి, చెన్నై, ముంబై, భువనేశ్వర్‌ల నుంచి విమానాల ద్వారా నగదు తరలించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. తెలంగాణలో 8500 ఏటీఎంలు ఉండగా దాదాపు సగం ఏటీఎంలు మూత పడిన విషయాన్ని అధికారులు అంగీకరించారు. విమానాల ద్వరా నోట్ల తరలింపు చేపట్టేందుకు ఆర్‌బీఐ అనుమతి కోరామని, గ్రీన్ సిగ్నల్‌ వచ్చిన వెంటనే పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు నోట్లను తరలిస్తామని ఎస్‌బీఐ అధికారులు తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు