గుడి నిండా క‌రెన్సీ నోట్లు... ఎందుకో తెలుసా?

గుడి నిండా క‌రెన్సీ నోట్లు... ఎందుకో తెలుసా?

సాధార‌ణంగా పండుగ‌లు, ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో గుళ్ల‌ను శోభాయ‌మానంగా తీర్చిదిద్ద‌డం ఆన‌వాయితీ. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు, పండుగ‌ల సంద‌ర్భంగా గుడి వెలుప‌ల విద్యుద్దీపాలంక‌ర‌ణ‌లు....గుడి లోప‌ల పూలు, పండ్ల‌తోనూ అలంక‌రిస్తారు. అయితే, త‌మిళ‌నాడులోని ఓ ప్రాంతంలో మాత్రం నూత‌న సంవ‌త్స‌ర వేడుకల సంద‌ర్భంగా ఓ గుడిని క‌రెన్సీ నోట్ల‌తో అలంక‌రిస్తార‌ట‌. ఆ గుడి ద్వారం మొద‌లుకొని గ‌ర్భ‌గుడి వ‌ర‌కు ర‌క‌ర‌కాల క‌రెన్సీ నోట్ల‌తో అలంక‌రించ‌డం అక్క‌డ ఆన‌వాయితీ అట‌. ఆ గుడిలోని గోడ‌లు, సీలింగ్ ల‌ను కూడా నోట్ల‌తో అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా అలంక‌రించడం ఆ గుడి సంప్ర‌దాయ‌మ‌ట‌. ప్ర‌స్తుతం నోట్ల‌తో అలంక‌రించిన ఆ గుడి వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

భార‌త దేశంలోని వివిధ ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ర‌క‌ర‌కాల ఆచార వ్య‌వ‌హారాలు, సంప్ర‌దాయాలు ఉంటాయి. ఒక రాష్ట్రంలో జ‌రిగే పండుగ‌లు, ఆచార సంప్ర‌దాయాలు వేరే రాష్ట్రంలో ప్రజలకు వింత‌గా అనిపించ‌వ‌చ్చు. అదే త‌ర‌హాలో, త‌మిళ‌నాడులోని ఓ గుడిలో నూతన సంవత్సర వేడుకలు వినూత్నంగా జ‌రుపుకుంటార‌ట‌. త‌మిళ నూత‌న సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా చెన్నైలోని అరుంబక్కమ్ లో ఉన్న‌ బాల వినయగర్ ఆలయాన్ని ప్ర‌తి ఏటా నోట్ల‌తో ముస్తాబు చేస్తార‌ట‌. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా రూ.4 లక్షల నగదుతో ఆలయాన్ని అందంగా అలకరించారు. ప్ర‌తి ఏటా క‌రెన్సీతో ఆల‌యాన్ని అలంకరించడం త‌మ సంప్రదాయమని స్థానికులు తెలిపారు. రూ.10 నుంచి రూ.2000 వ‌ర‌కు వివిధ ర‌కాల నోట్ల‌తో అందంగా అలంక‌రించిన ఆ ఆలయాన్ని చూసేందుకు భ‌క్తుల‌తో పాటు సామాన్యులు కూడా బారులు తీరుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు