జైట్లీని... ఆడుకున్న కేటీఆర్‌, లోకేష్ !

జైట్లీని... ఆడుకున్న కేటీఆర్‌, లోకేష్ !

ఒక్కోసారి కొన్ని విష‌యాలు భ‌లే బ్యాక్ ఫైర్ అవుతుంటాయి. అది భారీ స్థాయి షాక్ కూడా అవ్వ‌చ్చు.  అరుణ్ జైట్లీకి ఈరోజు స‌రిగ్గా అలాంటిదే జ‌రిగింది. పొద్దున లేచి మోడీ మొహం చూశాడో ఏమో గానీ... తెలుగు రాష్ట్రాల సీఎంల కొడుకులు అలియాస్ మంత్రులు అయినా కేటీఆర్‌, లోకేష్‌లు జైట్లీని ఉతికి ఆరేశారు.

ఇంత‌కీ జైట్లీ ఏం చేశారంటే.... ఈరోజు ఒక జాతీయ పత్రిక దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో ఉన్న న‌గ‌దు కొర‌త స‌మ‌స్య‌పై ప్ర‌త్యేక క‌థ‌నం ప్ర‌చురించింది. ఢిల్లీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో న‌గ‌దు కొర‌త తీవ్రంగా ఉంద‌న్న‌ది ఆ క‌థ‌నం. వారు ఆ క‌థ‌నాన్ని సోష‌ల్ మీడియాలో ప్ర‌జ‌ల ప్ర‌త్య‌క్ష రిపోర్టులు ఆధారంగా రాసిన‌ట్టు చెప్పారు. అస‌లు ఏటీఎంల‌న్నీ నో క్యాష్ బోర్డుల‌తో ద‌ర్శ‌నం ఇస్తున్నాయ‌ని ఒక‌రు, క్యాష్ కోసం వంద కిలోమీట‌ర్ల ప్ర‌యాణించాన‌ని ఇంకొక‌రు ట్వీట్లు చేశారు. దీనిని ఆ ప‌త్రిక ప్ర‌స్తావించింది. వీటికి స‌మాధానంగా మ‌న ద‌గ్గ‌ర కావాల్సినంత డ‌బ్బుంది, స‌ర్దుతాం అని ఆర్థిక శాఖ చేసిన ట్వీట్‌ను కూడా ప్ర‌స్తావించారు. ఆ క‌థ‌నం ప్ర‌చురిత‌మ‌య్యాక అరుణ్ జైట్లీ ట్విట్ట‌ర్లో స్పందిస్తూ... దేశంలో క్యాష్ కొర‌త లేదు. ఇది తాత్కాలిక స‌మ‌స్య... అని ట్వీట్ చేశారు.   

దీనికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌, ఆంధ్రా మంత్రి లోకేష్ ఇద్ద‌రూ జైట్లీకి గ‌ట్టి రిప్ల‌యి ఇచ్చారు. కనీసం ఈ సమస్య పైనైనా వాస్తవం ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. మా రాష్ట్రంలో ఈ సమస్య ఎప్పటి నుంచో ఉందని చెప్తుంటే, రాష్ట్ర బీజేపీ నాయకులు, మా మీద విరుచుకుపడ్డారు. కనీసం ఇప్పటికైనా సమస్య పరిష్కారం చెయ్యండి. అని లోకేష్ టెక్నిక‌ల్‌గా ట్వీట్ చేశారు.

కేటీఆర్ కొంచెం స్ట్రాంగ్ కౌంట‌రే ఇచ్చారు. అయ్యా అరుణ్ జైట్లీ గారు క్యాష్ కొర‌త స‌డెన్ గా వ‌చ్చిందీ కాదు, తాత్కాలిక స‌మ‌స్యా కాదు... గ‌త మూడు నెల‌లుగా నాకే చాలా ఫిర్యాదులు వ‌చ్చాయి. మీరు కాస్త ఆర్థిక‌శాఖ‌తో ఆర్బీతో క‌లిసి కూలంకుషంగా చ‌ర్చించి ప‌రిష్కారాలు క‌నుక్కోండి. ఇప్ప‌టికే జనానికి బ్యాంకుల మీద న‌మ్మ‌కం పోతోంది అంటూ ట్వీట్ చేశారు.
తెలుగు సీఎంల సుపుత్రులు ఇద్ద‌రూ ఒకే అంశంపైన‌, ఒకే నాయ‌కుడికి ఒకే ర‌కంగా కౌంట‌ర్ ఇవ్వ‌డం అరుదైన విష‌య‌మే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English