ఆయన తలచుకుంటే జగన్, పవన్ చేయలేని పని కూడా చేయగలడు.. !

ఆయన తలచుకుంటే జగన్, పవన్ చేయలేని పని కూడా చేయగలడు.. !

ఏపీ రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబుపై పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలు అసంబద్ధమని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. అమరావతిలోనే రాజధాని ఎందుకు కడుతున్నారు... చంద్రబాబు సామాజిక వర్గం వారే అక్కడ స్థలాలు కొనుక్కుంటున్నారని వస్తున్న ఆరోపణలతో ఏకీభవించాల్సిన అవసరం లేదన్నారు. అమరావతి కోసం పక్కా ప్లానింగ్ జరుగుతోందని.. అలాగే వేల ఎకరాల అవసరం తక్షణమే లేకపోయినా భవిష్యత్ అవసరాల కోసం వేల ఎకరాలు అవసరం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే... అమరావతిపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ... ఆయన ఒకప్పుడు సీఎస్ గా పనిచేశారని.. రాజధాని ఫైళ్లన్నీ ఆయన చేతుల మీదుగా వెళ్లాయని... జగన్, పవన్ లు చంద్రబాబుపై ఆరోపణలను రుజువు చేయలేకపోయినా తలచుకుంటే ఐవైఆర్ రుజువు చేయగలరని.. కానీ, ఆయన పుస్తకాల్లో ఆరోపణలు చేసినా రుజువు చేసే ప్రయత్నాలు చేయలేదని అన్నారు.

అలాగే... రాజధానిలో వేల కోట్లు ఖర్చు పెట్టడంపైనా ఆయన మాట్లాడారు. ఒకప్పుడు 15 నుంచి 20 లక్షలకు అపార్టుమెంట్లు వచ్చేవని.. ఇప్పుడు విశాఖలో అపార్టుమెంటు కావాలంటే 70 లక్షలు కావాలని, నిర్మాణ ఖర్చులు వంటివన్నీ పెరిగి ధరలు పెరిగాయని.. ఆ క్రమంలో రాజధాని కోసం కూడా వేల కోట్లు ఖర్చు కావొచ్చన్నారు.

అదేసమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఒక సామాజికవర్గానికే ప్రయారిటీ ఇస్తోందన్న ఆరోపణలపైనా ఆయన స్పందించారు. అచ్చెన్నాయుడిదే సామాజికవర్గం? అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులదే సామాజిక వర్గం అంటూ ఆయన ప్రశ్నించారు. మొత్తానికి చంద్రబాబుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు టీడీపీ నేతలు ఎంతవరకు సమర్థంగా తిప్పికొట్టగలుగుతున్నారో లేదో కానీ తటస్థ నేతగా ఉన్న సబ్బం మాత్రం చంద్రబాబుపై ఆరోపణలను తిప్పికొట్టడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English