మోదీని ఉతికి ఆరేసిన ఎంపీ.. రైల్వే స్టేషన్లో రాత్రంతా నిరసన

మోదీని ఉతికి ఆరేసిన ఎంపీ.. రైల్వే స్టేషన్లో రాత్రంతా నిరసన

ఏపీ విషయంలో వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు తన నియోజకవర్గంలోని శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో ఆకస్మికంగా నిరసనకు దిగారు. 12 గంటల పాటు రైల్వే స్టేషన్లో ఉంటూ, అక్కడే నిద్రిస్తూ నిరసన తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... దేశంలో ఉన్న 545 ఎంపీల్లో ఒకే ఒక్క ఎంపీ రైల్వే స్టేష‌న్లో ఎందుకు ప‌డుకున్నాడో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ స‌మాధానం చెప్పాలని అన్నారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా రాష్ట్రంపై విషం చిమ్ముతున్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ తీరుకు నిర‌స‌న‌గా ఈ దీక్ష చేస్తున్నట్లు చెప్పారు.

1.50 ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న హాజీపూర్‌కి రైల్వేజోన్ కేటాయించిన కేంద్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి రైల్వే జోన్ కేటాయించ‌డంలో ఎందుకు వివ‌క్ష చూపిస్తుంద‌ని ప్ర‌శ్నించారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న‌హామీలు నెర‌వేర్చ‌మ‌ని మేము కేంద్రాన్ని అడుగుతుంటే రాష్ట్రాన్ని అవ‌మానిస్తూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుని అవ‌మానిస్తూ ఢిల్లీ పెద్ద‌లు విషం చిమ్ముతూ రాజ‌కీయం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఎంతో ఓపిక, స‌హ‌నంతో ఉన్నార‌ని తెలిపారు. మొద‌ట్లోనే కేంద్రంతో క‌య్యం పెట్టుకుంటే రాష్ట్రాభివృద్ధి కుంటుప‌డుతుంద‌ని చంద్ర‌బాబు ఆలోచించార‌ని తెలిపారు. కేంద్రం సాయం చేస్తుంద‌ని 5 బ‌డ్జెట్‌లు చూశాక ఇంకా వేరే గ‌త్యంత‌రం లేక‌ ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి పోరాడాల్సి వ‌స్తుంద‌న్నారు. నిర‌స‌న‌ల‌తో, దీక్ష‌ల‌తో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా గాంధీ మార్గంలో తాను రైల్వే స్టేష‌న్లో 12 గంట‌ల‌పాటు దీక్ష చేస్తున్న‌ట్లు రామ్మోహ‌న్ నాయుడు చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English