తెలుగ‌మ్మాయికి ఈసీ క్లీన్ చిట్‌

తెలుగ‌మ్మాయికి ఈసీ క్లీన్ చిట్‌

ముక్కుసూటిగా ఉండే అధికారుల‌కు ఎన్ని తిప్ప‌లు ఎదుర‌వుతాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అందునా.. రాష్ట్ర మంత్రుల‌తో త‌ల‌ప‌డిన‌ప్పుడు ఈ ఇబ్బందులు మ‌రింత ఎక్కువ‌గా ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ న‌మ్మిన సిద్ధాంతానికి ఏ మాత్రం డీవియేట్ కాకుండా వ్య‌వ‌హ‌రించే అధికారులు చాలా కొద్ది మందే ఉంటారు. అలాంటి కోవ‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి క‌ర్ణాట‌క హాస‌న్ జిల్లా క‌లెక్ట‌ర్ రోహిణి సింధూరి.  

ఈ తెలుగ‌మ్మాయ్ క‌ర్ణాట‌క క్యాడ‌ర్ లో ప‌ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హాస‌న్ కు చెందిన మంత్రి మంజుతో కొద్దికాలంగా గొడ‌వ‌లున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్ రోహిణిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన ఎన్నిక‌ల క‌మిష‌న్ తాజాగా రోహిణికి క్లీన్ చిట్ ఇచ్చింది. మంత్రి చేసిన ఆరోప‌ణ‌ల‌కు ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేద‌ని తేల్చింది. ఈ మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సంజీవ్ కుమార్ ఒక ప్ర‌క‌ట‌న చేశారు.

క‌ర్ణాట‌క రాష్ట్ర ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యాక బంజ‌రు భూముల సాగు ప‌త్రాల్ని అందించారన్న ఆరోప‌ణ మంత్రి మంజుపైరాగా.. సంబంధిత త‌హ‌శీల్దార్ ను స‌స్పెండ్ చేయాలంటూ క‌లెక్ట‌ర్ హోదాలో ఉన్న రోహిణి ఆదేశించారు. దీంతో.. మంత్రికి.. క‌లెక్ట‌ర్ కు విభేదాలు పెరిగాయి. మ‌హా మ‌స్తకాభిషేకం సంద‌ర్భంగా మంత్రికి.. క‌లెక్ట‌ర్ కు మ‌ధ్య‌న విభేదాలు ఉండ‌టం.. త‌న ప‌వ‌ర్ చూపించి క‌లెక్ట‌ర్ పై బ‌దిలీ వేటు వేయాల‌ని ప్ర‌య‌త్నించినా.. ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌టంతో ప్ర‌భుత్వం బ‌దిలీను నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇదిలా ఉండ‌గా.. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన ప‌రిణామాలు వీరిద్ద‌రి మ‌ధ్య మ‌రింత దూరాన్ని పెంచాయి. ఈ నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్ పై మంత్రి చేసిన ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ జ‌రిపిన ఈసీ.. క‌లెక్ట‌ర్ రోహిణికి క్లీన్ చిట్ ఇచ్చారు. ముక్కుసూటిగా.. నిజాయితీగా విధులు నిర్వ‌ర్తించే తెలుగ‌మ్మాయి త‌న తీరుతో మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చార‌ని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English