పవన్ కల్యాణ్‌ది కన్ఫ్యూజింగ్ పాలిటిక్స్

పవన్ కల్యాణ్‌ది కన్ఫ్యూజింగ్ పాలిటిక్స్

రాజకీయాల్లో అనేక రకాలున్నాయి. నీతిమంతమైన రాజకీయాలు.. స్వార్థ రాజకీయాలు, నేర రాజకీయాలు, మోసపూరిత రాజకీయాలు.. ఇలా ఎన్నో రకాలున్నాయి. కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న రాజకీయం మాత్రం పూర్తిగా సరికొత్తదని సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎంపీ సబ్బం హరి అంటున్నారు. పవన్ కల్యాణ్ కన్ఫ్యూజింగ్ పాలిటిక్సు చేస్తున్నారని.. రాజకీయాల్లో ఇది పూర్తిగా కొత్తదని ఆయన అంటున్నారు. ఆయన స్టాండేంటే.. ఎవరి పక్షమో.. లక్ష్యమేంటో, అజెండా ఏంటో అర్థం కావడం లేదని.. కన్ఫ్యూజన్ పాలిటిక్స్ అంటే ఇదేనని ఆయన అన్నారు.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ని మొదట్లో చూసి సీరియస్ పొలిటీషియన్ అని అనుకోలేదని మాజీ ఎంపీ సబ్బంహరి అన్నారు. ఓ ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ, కాకినాడ మీటింగ్ లో బీజేపీపై పవన్ ధ్వజమెత్తినప్పుడు సీరియస్ గానే ఉన్నాడనిపించిందని అన్నారు. ఆ తర్వాత ఎక్కువ సందర్భాల్లో టీడీపీని సపోర్టు చేశాడని, టీడీపీని విమర్శించకుండా ఉన్నంత వరకూ పవన్ కల్యాణ్ ట్రంప్ కార్డులాగానే తనకు అనిపించాడని చెప్పారు.

ప్రస్తుతం, పవన్ కల్యాణ్ వైఖరి అర్థం కాకుండా ఉందని, అలా, అర్థం కాకుండా ఉండటమే ఆయన వైఖరేమో, ఒకవేళ రహస్య అజెండా ఏమైనా ఆయనకు ఉందేమో అని హరి అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో వెళతాడా? చివర్లో టీడీపీకేమైనా సపోర్టు చేస్తాడా? లేక ఎవరికీ మద్దతు ఇవ్వకుండా సొంతంగా ఉంటాడా? అనేది పవన్ చెప్పకుండా తన తెలివితేటలతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడని, అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడని ఆయన అభిప్రాయపడ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English