మోడీ డ‌బ్బులు ఇస్తున్నా బాబు తీసుకోవ‌టం లేద‌ట‌

మోడీ డ‌బ్బులు ఇస్తున్నా బాబు తీసుకోవ‌టం లేద‌ట‌

ఏపీ హోదా సాధ‌న కోసం జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు హ‌రిబాబు. ఏపీకి కేంద్రం సాయం చేస్తున్నా రాష్ట్రం నిధులు తీసుకోవ‌టం లేదంటూ కొత్త మాట‌ను చెప్పుకొచ్చారు.

ఏపీకి సాయం చేసేందుకు కేంద్రం స‌హ‌క‌రిస్తుంద‌ని.. అయినా.. ఏపీ స‌ర్కారు మాత్రం నిధులు తీసుకోవ‌టం లేద‌న్నారు. ప్ర‌త్యేక ఆర్థిక సాయాన్ని ప్ర‌భుత్వం రాష్ట్రంలో ఏయే అభివృద్ధి ప్రాజెక్టులు అమ‌లు చేయాలనుకుంటుందో.. ఆ అమలుకు ఒక ప్ర‌త్యేక విధానాన్ని ఏర్పాటు చేస్తే దాని నుంచి నిధులు అందిస్తామ‌ని చెప్పామ‌న్నారు. ఏపీకి నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా ఏపీ స‌ర్కారు నుంచి స‌మాధానం రావ‌టం లేద‌న్నారు.

ఏపీకి ఇప్ప‌టివ‌ర‌కూ నిధులు ఇవ్వ‌టం లేద‌ని.. తాము లెక్క‌లు చెబుతున్నా.. ప్ర‌తిపాద‌న‌లు పంపుతున్నా కేంద్రం నుంచి ఎలాంటి స‌మాధానం రావ‌టం లేదంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు మాట‌కు కౌంట‌ర్ గా హ‌రిబాబు వ్యాఖ్య‌లు ఉన్నాయి. సుమారు రూ.16వేల కోట్ల ఆర్థిక సాయానికి కేంద్రం సిద్దంగా ఉంద‌న్నారు.

అయితే.. ఆ నిధుల్ని తీసుకోవ‌టానికి ఏపీ స‌ర్కారు సిద్ధంగా లేద‌న్నారు. ఒక‌వేళ సాయాన్ని తీసుకుంటే.. హోదాకు బ‌దులుగా ఇచ్చే ఆర్థిక సాయాన్ని అందుకున్నారు కాబ‌ట్టి.. హోదా నినాదాన్ని ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌న్న భ‌యంతో నిధులు తీసుకోవ‌టం లేద‌న్నారు.

బీజేపీ నేత‌లు క‌ళ్లు మూసుకున్నారో లేక‌పోతే తప్ప‌క మాట్లాడుతున్నారో కానీ... ఎవ‌రైనా కేంద్రం డ‌బ్బులు ఇస్తారంటే తీసుకోకుండా ఉంటారా? ఏ రాష్ట్రమైనా అలా చేయ‌గ‌ల‌దా? గ‌తంలో బాబు అవినీతి చేసి తినేస్తాడు కాబ‌ట్టి ఇవ్వ‌లేద‌ని ఒక బీజేపీ నేతే అన్నాడు. మ‌రి ఇపుడేమో హ‌రిబాబు ఇస్తామంటే తీసుకోవ‌ట్లేదు అంటారు. మాట‌కు మాట‌కు పొంతన లేక‌పోతే ఎలా  హ‌రిబాబు! పార్టీ సిద్ధాంతాల‌ను ఫాలో అవ‌డం ముఖ్య‌మే గాని మీకు ప్రజాభిప్రాయానికి వ్య‌తిరేకంగా మాట్లాడితే పార్టీ ఉన్నా ఉప‌యోగం లేద‌ని గుర్తించాలి కదా. ఇదంతా ఎందుకు బీజేపీ ఫేస్‌బుక్  పేజీలో జ‌నం బీజేపీ గురించి రాసిన రివ్యూలు చ‌దువుకున్నా కూడా మళ్లీ మ‌ళ్లీ బీజేపీ నేత‌లు ఇలా మాట్లాడ‌రు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English