జ‌గ‌న్ ను ఇరుకున ప‌డేసిన జ‌లీల్ ఖాన్!

జ‌గ‌న్ ను ఇరుకున ప‌డేసిన జ‌లీల్ ఖాన్!

బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్న త‌ర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు, నేత‌లు ...ప్ర‌ధాని మోదీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగిన త‌ర్వాత టీడీపీ నాయ‌కులు త‌మ స్వ‌రం పెంచారు. ఈ నేప‌థ్యంలో నిన్న ప్ర‌ధాని మోదీ చేసిన నిరాహార దీక్ష‌పై టీడీపీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్ల‌మెంటును సజావుగా న‌డ‌ప‌లేక‌, ప‌రిపాల‌న చేత‌గాని మోదీ చివ‌ర‌కు దీక్ష‌లంటూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. దేశ‌న్ని పాలించ‌డం చేతగాని మోదీ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. మోదీని ఏపీ ప్ర‌తిపక్ష నేత జ‌గ‌న్ విమ‌ర్శిస్తే....తాను జ‌గ‌న్ కాళ్లు ప‌ట్టుకుంటాన‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. విజ‌యవాడ‌లో విలేక‌ర్ల‌తో మాట్లాడిన జ‌లీల్ ఖాన్ జ‌గ‌న్ పై అనేక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అపార అనుభవం ఉన్న వ్య‌క్త‌ని, ఆయ‌న బాధ్యతగల సీఎం కాబట్టి కేంద్రం వైఖ‌రిపై నాలుగేళ్లు ఓపిక పట్టారని జ‌లీల్ ఖాన్ అన్నారు. అంతే బాధ్య‌త గా వ్య‌వ‌హ‌రించాల్సిన‌ ప్రతిపక్ష నేత జగన్ నాలుగేళ్ల కాలంలో ఏం చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న మోదీకి వ్య‌తిరేకంగా ఒక్క వ్యాఖ్య చేయ‌లేద‌ని, అటువంటి జ‌గ‌న్ చిత్తశుద్ధిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారని జ‌లీల్ ఖాన్ అన్నారు. మోదీని జ‌గ‌న్ విమ‌ర్శిస్తే త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని అన్నారు. పాదయాత్రలో ఉన్న జగన్ త‌న నోటితో....మోదీ దొంగ, ఏపీని బీజేపీ మోసం చేసింది అని ఒక్క మాట అంటే త‌న‌ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఆదాయ‌పు ప‌న్ను కట్టనవసరం లేద‌న్న జ్ఞానం లేని జగన్ ముఖ్యమంత్రిగా పనికి రాడ‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

అయితే, జ‌గ‌న్ ను జ‌లీల్ ఖాన్ స‌రిగ్గా పాయింట్ చూసి ఇరికించార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మోదీ, కేంద్రంపై జ‌గ‌న్ వైఖ‌రి గురించి ఏపీ ప్ర‌జ‌లు ఆలోచించేవిధంగా కామెంట్స్ చేశార‌ని అనుకుంటున్నారు. మోదీని జ‌గ‌న్ తిట్టే ప‌రిస్థితులు ప్ర‌స్తుతం లేవ‌ని, కాబ‌ట్టి జ‌గ‌న్ ఇరుకున‌ ప‌డే వ్యాఖ్య‌లు జ‌లీల్ ఖాన్  చేశార‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా కూడా వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి....మోదీతో భేటీ అవ్వ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డానికి వైసీపీ త‌హ‌త‌హ‌లాడుతోంద‌ని టాక్ ఉంది. త‌న‌పై ఉన్న కేసులు తిర‌గ‌దోడ‌కుండా ఉండేందుకు జ‌గ‌న్... మోదీల మ‌ధ్య లోపాయికారి ఒప్పందం కుదురింద‌ని, అందుకే మోదీని జ‌గ‌న్ ప‌ల్లెత్తు మాట అన‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ను జ‌లీల్ ఖాన్ విలువైన లాజిక్ తో ఇరుకున ప‌డేశాడ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English